Adipurush: కనీవినీ ఎరగని నిర్ణయం.. ‘హనుమంతుడి తోడుగా.. ఆదిపురుష్ చూడాలా..?

|

Jun 06, 2023 | 9:23 PM

ఆ రాఘవుడి చరితను.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో..! VFX హంగులతో..! అద్భుతంగా చూపించడమే కాదు.. అందుకు తగ్గట్టుగా.. మరో పెద్ద నిర్ణయమే తీసుకున్నారు ఆదిపురుష్ మేకర్స్. జనాల్లో ఎప్పటి నుంచో ఉన్న నమ్మకాన్ని గౌరవిస్తూ... రామభక్తుడైన ఆ అంజనీ పుత్రను ప్రసన్నం చేసుకునేందుకు ఓ ప్రయత్నాన్ని తలపెట్టారు.

ఆ రాఘవుడి చరితను.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో..! VFX హంగులతో..! అద్భుతంగా చూపించడమే కాదు.. అందుకు తగ్గట్టుగా.. మరో పెద్ద నిర్ణయమే తీసుకున్నారు ఆదిపురుష్ మేకర్స్. జనాల్లో ఎప్పటి నుంచో ఉన్న నమ్మకాన్ని గౌరవిస్తూ… రామభక్తుడైన ఆ అంజనీ పుత్రను ప్రసన్నం చేసుకునేందుకు ఓ ప్రయత్నాన్ని తలపెట్టారు. హనుమంతుడి సమక్షంలో ఆదిపురుష్ చూసే విధంగా ఓ నిర్ణయం తీసుకున్నారు.రామాయణ పారాయణం జరిగే ప్రతీ చోటకి హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. పురాణాల్లో కూడా ఇదే లిఖించబడింది. అయితే దీన్నే ఇప్పుడు గౌరవిస్తూ… ప్రభాస్ ఆదిపురుష్ స్క్రీనింగ్ అయ్యే ప్రతీ థియేటర్లో ఒక సీటను.. ఎవరికీ సేల్ చేయకుండా ఖాళీగా ఉంచాలని మేకర్స్ నిర్ణయం తీసకున్నారు. నమ్మకాలను అనుసరించి.. అతి గొప్ప రామభక్తుడైన ఆ అంజనీ పుత్రకే.. ఆ సీటును ప్రత్యేకంగా కేటాయిస్తామంటూ.. తాజాగా ఈ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అతి గొప్ప రామ భక్తుడైన హనుమంతిడికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ… చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆదిపురుష్ సినిమాను హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం అంటూ.. తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ నోట్‌ను రిలీజ్ చేశారు. ఈ నిర్ణయంతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Published on: Jun 06, 2023 09:15 PM