విజయశాంతి ఎవరో కాదు.. రియల్ లైఫ్‌లో బాలయ్యకు కోడలు అవుతుంది

Updated on: Jun 03, 2025 | 6:46 PM

100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే అందులో ఒక హీరోయిన్ మాత్రం.. తనకు దగ్గరి బంధువు అవుతుంది. ఒకప్పుడు బాలయ్యతో కలిసి నటించిన హీరోయిన్ ఆ తర్వాత అదే బాలకృష్ణకు వరుసకు కోడలు అయ్యింది. ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.

అప్పట్లో బాలకృష్ణ- విజయశాంతిలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. రౌడీ ఇన్ స్పెక్టర్, నిప్పురవ్వ లాంటి హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. విజయశాంతి.. 1988లో ఎమ్వీ శ్రీనివాస్ ప్రసాద్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆయనకు బాలకృష్ణకు మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. బాలయ్యకు, శ్రీనివాస్ ప్రసాద్ వరుసకు కొడుకు అవుతాడు. బాలకృష్ణ పెద్దబావ గణేష్‌ రావుకు శ్రీనివాస్ స్వయానా మేనల్లుడు. ఈయనకు బాలయ్యకు మధ్య కూడా మంచి స్నేహం ఉంది. ఆ ఫ్రెండ్ షిప్‌తోనే బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేయాలని.. యువరత్న ఆర్ట్స్ స్థాపించి నిప్పురవ్వ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం స్వయంగా విజయశాంతి దగ్గరకు వెళ్లారు ప్రసాద్. అలా వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి బంధంగా మారింది. అలా విజయశాంతితో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలకృష్ణ ఆ తర్వాత వరుసకు ఆమెకు మావయ్య అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దిలావర్ సింగ్ భార్యను.. నేను కాదు మొర్రో అంటే వినరే..!

మహేష్ కోసం పోటీపడుతున్న.. ముగ్గురు స్టార్ డైరెక్టర్స్‌

సినిమా కొట్టింది.. కార్‌ పట్టుకెళ్లింది! ఆకాంక్ష సింగ్ ఆగట్లేదుగా

రూ.100 కోట్లకు ఓకే అంది! కానీ హీరోను చూసే జడుసుకుని సినిమా వదిలేసింది..

శింబుతో రిలేషన్‌కు చెక్ పెట్టింది! లక్కీ గర్ల్‌! లేదంటేనా..?