బేరం కుదరకే.. బిగ్ బాస్‌పై చాడీలు.. ఒకప్పటి హీరోయిన్‌ ఓవర్ యాక్షన్

Updated on: Sep 18, 2025 | 1:02 PM

బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే అన్ని భాషలలో ఈ షోను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షో ఇప్పటికే పలు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ షో 8 సీజన్స్ కంప్లీట్ కాగా.. ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ అయ్యింది.

ఇటీవలే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా జరిగిపోయింది. అయితే ఓ హీరోయిన్ మాత్రం బిగ్‌బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. అంతేకాదు.. దాదాపు 11 సంవత్సరాలుగా ఈ షో ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నా అంటూ చెప్పి అందరికీ షాకిచ్చింది. తన కామెంట్‌తో బిగ్ బాస్‌ లవర్స్‌ సర్కిల్లో ట్రోల్ అవుతోంది. దారుణ కామెంట్స్‌ను వచ్చేలా చేసుకుంటోంది. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరో కాదు.. ఆమే.. తన శ్రీ దత్తా..! బాలయ్య వీరభద్ర సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అరగేట్రం చేసిన తను శ్రీ దత్తా.. ఆ తర్వాత టాలీవుడ్‌లో రాణించలేపోయింది. నేటివ్ ఇండస్ట్రీ బాలీవుడ్లో కొన్నేళ్లు స్టార్ హీరోయిన్‌గా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత సినిమాల నుంచి కనుమరుగైపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన వీడియోలతో.. కాంట్రో కామెంట్స్‌తో హాట్ టాపిక్ అవుతుంటుంది. ఈక్రమంలోనే ఈ బ్యూటీ.. తనకు బిగ్ బాస్‌ నుంచి దాదాపు 11 సంవత్సరాల నుంచి పిలుపు వస్తూనే ఉందని.. అయినా తాను నో చెబుతూనే ఉన్నా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చి ఇస్తానని చెప్పినా కూడా తాను బిగ్ బాస్‌లోకి వెళ్లేందుకు నో చెబుతానంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఈ బ్యూటీ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షో ఆఫ్‌ చేసేందుకే బిగ్ బాస్ షో పై తను శ్రీ దత్తా కామెంట్స్‌ చేస్తుందని.. బేరం కుదరకే ఈమె బిగ్ బాస్‌ షోకు వెళ్లలేదని కామెంట వస్తున్నాయి. ఇంకొందరు నెటిజన్స్‌ ఏమో.. అసలు ఈమెకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందో లేదో? అంటూ డౌట్స్ వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇలా తను శ్రీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు బిగ్ బాస్ లవర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vande Bharat: నరసాపురానికి తొలి వందే భారత్ రైలు..

Published on: Sep 18, 2025 12:59 PM