సొంత తండ్రి నుంచే దారుణ వేధింపులు.. ఏడుస్తూ చెప్పిన హీరోయిన్

Updated on: May 15, 2025 | 12:41 PM

వెండితెర, బుల్లి తెర! తెరేదైనా.. వెలిగిపోయే హీరోయిన్లకు.. చేదు జ్ఙాపకాలు ఉంటాయి. అవి వారిని వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడప్పుడూ ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తుంటాయి. అలా షైనీ దోషీని కూడా తన తండ్రి మిగిల్చిన చేదు జ్ఙాపకాలను ఓ ఇంటర్వ్యూలో అందరితో పంచుకుంది. తన తండ్రి నుంచి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటకు చెప్పింది.

తన తండ్రి నీచపు మాటలను తన ఫ్యాన్స్‌తో పంచుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతుంది. షైనీ దోషి.. ! టెలివిజన్ నటి, హిందీ సీరియల్స్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తర్వాత నటన వైపు మళ్లింది. 2013లో “సరస్వతీచంద్ర” సీరియల్‌లో కుసుమ్ దేశాయ్ పాత్రతో టెలివిజన్‌లో అడుగుపెట్టింది. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కష్టాల గురించి చెప్పుకొచ్చింది.ఇందులో తన తండ్రి నుండి ఎదురైన అవమానాలు కూడా ఉండడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాణి చీమల అక్రమ రవాణా.. మార్కెట్ లో వాటి విలువ తెలిస్తే షాక్

అమెజాన్‌ అడవుల్లో భారీ అనకొండ హల్‌చల్‌

కూల్‌డ్రింక్స్‌ ఇష్టంగా తాగేస్తున్నారా.. జాగ్రత్త

ఈ అన్నం తింటే షుగర్ అస్సలు పెరగదు.. ట్రై చేయండి!!

2 నెలల గ్యాప్‌లో 2 లగ్జరీ కార్లు..! దాదాపు రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన సోనియా