స్మగ్లింగ్‌తో నెలకు రూ.3 కోట్ల ఆదాయం! ఈమె హీరోయిన్ కాదు.. జగత్‌ కిలాడీ

Updated on: Mar 10, 2025 | 8:29 PM

దేశవ్యాప్తంగా కలకలం రేపిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యారావుకు చుక్కెదురయ్యింది. రన్యా రావును మూడు రోజుల పాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. ఆమెను మూడు రోజుల పాటు విచారించబోతున్నారు DRI అధికారులు. లాస్ట్ ట్రిప్పులో 14.2 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ హీరోయిన్‌ రన్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

. రన్యారావ్‌ మొత్తం 27 సార్లు దుబాయ్‌కు వెళ్లారని వెల్లడించారు DRI అధికారులు. ప్రతీసారీ ఒకే డ్రెస్‌తోనే దుబాయ్‌ కు వెళ్లారని, అందులోనే గోల్డ్‌ని స్మగ్లింగ్‌ చేశారని తెలిపారు. గత 15 రోజుల్లో 4 సార్లు, 2 నెలల్లో పదిసార్లు దుబాయ్‌కి వెళ్లొచ్చారు రన్యారావు. ఒకో ట్రిప్పునకు రన్యారావుకు రూ.10 నుంచి 50 లక్షల ఆదాయం వచ్చేదని అధికారులు వెల్లడించారు. ఈ కన్నడ హీరోయిన్‌..గోల్డ్‌ స్మగ్లింగ్‌ ద్వారా నెలకు కోటి నుంచి రూ. 3 కోట్ల ఆదాయం ఆర్జించేదని విచారణలో తేలింది. ఇక దుబాయ్‌తోపాటు, యూరప్‌, అమెరికాకు కూడా వెళ్లినట్లు విచారణలో రన్యా వెల్లడించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: చెల్లెలి మరణాన్ని తలుకుచుని.. ఎమోషనల్ అయిన చిరు

బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే మీ అకౌంట్‌ బ్లాక్‌