Gauthami: దుర్మార్గుడి చేతివాటం.. ఏకంగా హీరోయిన్ 25 కోట్లుపై కన్ను..!

Gauthami: దుర్మార్గుడి చేతివాటం.. ఏకంగా హీరోయిన్ 25 కోట్లుపై కన్ను..!

Anil kumar poka

|

Updated on: Sep 14, 2023 | 10:00 AM

గౌతమి! మీకు గుర్తుందా.. అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఇప్పటీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు...! ఆ.. ఆమెకే తాజాగా ఓ కష్టం వచ్చింది. కోట్ల విలువైన ఆస్తిని ఓ దుర్మార్గుడు అక్రమంగా లాక్కోవడంతో.. ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఆ దుర్మార్గుడి నుంచి ప్రాణ హాని ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. వాన్ని ఎలాగైనా శిక్షించి తన 25 కోట్ల ఆస్తి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు.

గౌతమి! మీకు గుర్తుందా.. అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఇప్పటీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు…! ఆ.. ఆమెకే తాజాగా ఓ కష్టం వచ్చింది. కోట్ల విలువైన ఆస్తిని ఓ దుర్మార్గుడు అక్రమంగా లాక్కోవడంతో.. ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఆ దుర్మార్గుడి నుంచి ప్రాణ హాని ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. వాన్ని ఎలాగైనా శిక్షించి తన 25 కోట్ల ఆస్తి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. మరి స్టార్ అండ్ సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న ఈ స్టార్ పరిస్థితి ఇలా అయిందేంటని అనుకుంటున్నారా..! అయితే ఈ వీడియో చూసేయండి.! ఇక ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు కోలీవుడ్లోనూ.. 90స్లో స్టార్ హోదా సంపాదించుకున్న గౌతమీ.. సినిమాలు చేస్తూ.. బాగానే సంపాదించారు. చెన్నై చుట్టుపక్కల కోట్లలో విలువైన స్థిరాస్తులను కూడా కూడబెట్టారు. అయితే తనకున్న ఆ స్థిరాస్తుల్లోంచి.. తన ఆరోగ్య ఖర్చుల నిమ్మిత్తం.. తన ఒక్కగానొక్క కూతురి చదువు నిమిత్తం.. కొంత భాగాన్ని తీసేయాలనుకున్నారు. దాదాపు 25కోట్ల విలువైన ఆ స్థలాన్ని అమ్మిపెట్టాల్సిందిగా.. అలగప్పన్ అనే ఏజెంట్‌కు అప్పజెప్పారు. అయితే అలగప్పన్‌ దొరికిందే ఛాన్స్ అని.. ఆ లాండ్ను కొట్టేశాడు. గౌతమి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. తప్పుడు పత్రాలు సృష్టించి.. ఆ ల్యాండ్ తనదే అంటూ.. గౌతమిని బెదిరించసాగాడు. గట్టిగా అడినందుకు చంపేస్తా అంటూ.. బెదిరించాడు. దీంతో తాజాగా అతడి మాటలను.. బెదిరింపులను సీరియస్ గా తీసుకున్న గౌతమి.. చెన్నై పోలీస్‌ స్టేషన్లో అలగప్పన్‌ పై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటే.. కాస్త ఎమోషనల్ అయ్యారు. దీంతో ఓ పక్క కోలీవుడ్‌ లో హాట్ టాపిక్ అవుతూనే నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు గౌతమి.

– సతీష్ చంద్ర(ఈటీ ప్రొడ్యూసర్).

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..