మొన్న నిధి అగర్వాల్.. నిన్న సమంత.. ఇవాళ విజయ్ వీడియో
సినీతారలపై అభిమానుల ప్రేమ హద్దులు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిధి అగర్వాల్, సమంత, ఇప్పుడు దళపతి విజయ్ కూడా ఇదే తరహా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విజయ్ చెన్నై ఎయిర్‌పోర్టులో అభిమానుల అత్యుత్సాహం వల్ల కిందపడటం, సెక్యూరిటీ వైఫల్యంపై చర్చ జరుగుతోంది. స్టార్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
సినీ తారలపై అభిమానుల ప్రేమ కొన్నిసార్లు హద్దులు దాటి ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తోంది. ఇటీవల హీరోయిన్లు నిధి అగర్వాల్, సమంత అభిమానుల అత్యుత్సాహానికి గురై అసౌకర్యానికి లోనయ్యారు. అదే తరహాలో తాజాగా కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మొన్న నిధి, నిన్న సమంత, ఇవాళ విజయ్ – పబ్లిక్ ఈవెంట్లలో స్టార్లకు అభిమానుల మధ్య దూసుకుపోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. విజయ్ జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ తర్వాత మలేషియా నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు. మలేషియాలో ఈవెంట్ పకడ్బందీగా జరిగినా, చెన్నై ఎయిర్‌పోర్టులో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. అక్కడ సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది.
మరిన్ని వీడియోల కోసం :
