Suman: నాపై ఆ స్టార్ చేతబడి చేశారు.. కేరళ వెళ్లి మరీ విరుగుడు చేయించుకున్నా

Updated on: Oct 28, 2025 | 3:08 PM

ఒకప్పటి స్టార్‌ హీరో సుమన్‌ చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన నటుల్లో ఒకరు. గతంలో సుమన్ అనుకోకుండా ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లడం, ఆరు నెలల పాటు జైలులో ఉండటంతో ఆయన కెరీర్‌ దెబ్బతింది. జైలు నుంచి వచ్చిన తర్వాత హీరోగా చేసిన అతని సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో అలాగే టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు.

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో తనపై చేతబడి జరిగిందని బయటపెట్టారు. ఎవరు చేయించారనేది తెలియదన్నారు. సినిమా పరిశ్రమలోనే కాదు బిజినెస్‌ రంగంలోనూ ఇలాంటివి ఇప్పటికీ జరుగుతుంటాయని కేరళ వాళ్లకే దీని గురించి బాగా తెలుసనీ దాన్ని తగ్గించడం వంటి విద్యలు వారే చేస్తుంటారని చెప్పారు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో తనపై చేతబడి చేసారని చెప్పుకొచ్చారు. అప్పట్లో తనకు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయని కొంత మంది చెబితే కేరళలోని చోటానికరకు వెళ్లి విరుగుడు పూజ చేయించానని సుమన్ తెలిపారు. అది సరిగా పనిచేసిందా లేదా తనకు తెలియదనీ కానీ తను టైమ్‌ని బాగా నమ్ముతాననీ ఏది జరగాలో ఆ టైమ్‌ జరిపిస్తుంది అదే కర్మ అని సుమన్‌ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. రోగాలు, ఎదురుదెబ్బలు, విజయాలు అన్నీ మన కర్మ ప్రకారం జరుగుతాయని, వాటిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని, టైమ్‌ మన జీవితంలో కీలకమని అన్నారు. తాను అనుభవపూర్వకంగా చెబుతున్నానని అన్నారు. మనం చెప్పుకోవడానికి చాలా చెప్పొచ్చు, వాడు తొక్కేశాడు, వీడు నొక్కేశాడు, ఎక్కేశాడు, వీడి వల్ల అలా జరిగింది, ఇలా జరిగిందని అంటారని, కానీ ఆ టైమ్ అలా జరిపిస్తుందన్నారు. నిజానికి వాళ్లకు అలా చేయాలనే ఉద్దేశం ఉండదు కానీ టైమ్ వాళ్లని అలా చేయిస్తుంది, అది కూడా వాళ్ల రాతే, దాన్నే కర్మ అని అంటారని చెప్పుకొచ్చారు. సుమన్‌ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసాయి. చేతబడి, కర్మ, టైమ్‌ గురించి ఆయన తాత్విక ధోరణిలో మాట్లాడటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Director Teja: పరోపకారం చేయబోతే.. రూ.కోటి ఫైన్ పడింది.. పాపం తేజ

లైంగిక ఆరోపణలు కారణంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్

Allu Arjun: మాటల్లేవ్‌ అంతే..! ‘కాంతార’పై బన్నీ మాస్‌ రివ్యూ

‘ఫౌజీ’ టైటిల్‌లో సంస్కృత శ్లోకాలు.. వాటి అర్థం ఏంటంటే

చనిపోయాడని నదిలో నిమజ్జనం.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి.. ఏం జరిగింది