Actor Sadha: ఒంటరితనం మంచిది..! వైరల్‌గా మారిన నటి సదా పోస్ట్‌ ..! ఈ అమ్మడికి ఏమైంది అసలు..

|

Nov 17, 2022 | 9:30 AM

ఒంటరిగా ఉండడం మంచిదంటుంది నటి సదా. ‘జయం’ సినిమాతో నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ‘దొంగా దొంగది’, ‘అవునన్నా కాదన్నా’,‘అపరిచితుడు’ లాంటి చిత్రాల ద్వారా తెలుగువారికి చేరువైంది.


ఒంటరిగా ఉండడం మంచిదంటుంది నటి సదా. ‘జయం’ సినిమాతో నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ‘దొంగా దొంగది’, ‘అవునన్నా కాదన్నా’,‘అపరిచితుడు’ లాంటి చిత్రాల ద్వారా తెలుగువారికి చేరువైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంది సదా. తాజాగా వ్యక్తిగత బంధాల పై ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.‘‘మనలో చాలా మంది వారికి ఇష్టమైన వ్యక్తులను కోల్పోతారేమో అని భయపడుతుంటారు. ఒకప్పుడు మీకు చాలా సన్నిహితంగా ఉన్నవారు కూడా ఒక్కొక్కసారి మీకు సహకరించరు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారు మాత్రమే మీకు పూర్తిగా సహకారం అందించగలరు. మీ ఎదుగుదలకు అడ్డువచ్చే వ్యక్తులను సున్నితంగా తిరస్కరించడం మేలు. మీరు ఒకరి కోసం త్యాగాలు చేసినా గుర్తింపు రాకపోతే మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఎందుకంటే మన జీవితంలోకి రకరకాలైన మనుషులు వచ్చి పోతుంటారు. కానీ చివరి వరకు మనతో ఉండేది మనం మాత్రమే. ఒకరి నుంచి సంతోషాన్ని ఆశించ వద్దు. అలా చేస్తే మీకు మీరే హాని చేసుకున్న వారవుతారు’’.ఇంకా సదా ఏమన్నది అంటే, ”మన ఇంట్లో అవసరం లేని వస్తువులను ఎలా అయితే బయటపడేసి శుభ్రం చేసుకుంటామో.. అలానే మన జీవితాల్లో నుంచి కూడా కొందరిని తీసేసి మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. జీవితం చాలా చిన్నది బలవంతంగా బంధాల్లో ఉండడం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండడం మంచిది. ” సదా పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు ఆమె అభిమానులు .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Woman – daughter: అమానుషం.. తన ప్రియుడితో కుమార్తెకు పెళ్లి చేయించిన తల్లి..! బిడ్డను కాపాడుకోవాల్సిన త‌ల్లే ఇలా..

Hognose snake: పాముల ప్రపంచానికి డ్రామా రాణి.. ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా.. చ‌నిపోయిన‌ట్లు న‌టించి..

Published on: Nov 17, 2022 09:30 AM