Prakash Raj: అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా ??

Updated on: Aug 02, 2025 | 1:02 PM

బెట్టింట్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం ఇప్పుడు మరో స్టేజ్‌కు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు ఆరోపణలు.. కేసులు నమోదు దగ్గర నుంచి నేడు ఈడీ రంగంలోకి దిగి సెలబ్రిటీలను విచారించే వరకు చేరుకుంది. మధ్యలో సెలబ్రిటీల పశ్చాత్తాపాలు.. ఇంకో సారి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయమనే స్టేట్మెంట్లు... ఇంకొంతమంది అసలు తాము బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేయనేలేదనే కామెంట్లు కట్ చేస్తే.. ఇప్పుడు డొంక కదులుతోంది.

అడుసు తొక్కనేలా.. కాళ్ల కడగనేలా అనే కామెంట్ జనాల నుంచి వచ్చేలా చేసుకుంటోంది. ఈక్రమంలోనే ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ను ఈడీ విచారించింది. ఈడీ అధికారుల నోటీసుల మేరకు.. జులై 30న విచారణకు హాజరైనా ప్రకాష్‌ రాజ్‌ను.. అధికారులు దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీలపై విచారణ జరిపి.. ప్రకాష్‌రాజ్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు ఈడీ అధికారులు. ఈ క్రమంలోనే దుబాయ్‌కి సంబంధించిన బెట్టింగ్‌ యాప్స్‌ నుంచి లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన ఈడీ.. ప్రకాశ్‌రాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే జంగిల్‌ రమ్మీ యాప్‌ను ప్రమోట్‌ చేసిన ప్రకాష్‌రాజ్.. రమ్మీ యాప్‌ ద్వారా తనకు ఒక్క పైసా కూడా రాలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. విచారణ తర్వాత తెలియక ఒకే ఒక్క యాప్‌ ప్రమోట్‌ చేశానని… ఇకపై బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్‌ చేయన్నారు. బెట్టింగ్ ఆడి ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ప్రకాశ్ రాజ్‌తో పాటు మొత్తం 29 మందికి నోటీసులు పంపింది ఈడీ. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్‌, సైబరాబాద్‌, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన FIRల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కింగ్డమ్‌తో స్టార్ అయినా.. రోడ్డుపై అమ్మతో.. ఇడ్లీలు అమ్ముకోవడం మానని నటుడు

అమెరికాలో జెండా పాతిన కొండన్న.. ఇది కలెక్షన్స్‌ జాతరంటే..!

చరణ్‌, పవన్‌, నానిలను దాటి.. కేరళ బాక్సాఫీస్ దగ్గర విజయ్‌ రాంపేజ్‌

కొబ్బరికాయల రాసి నుంచి వింత శబ్దాలు.. అక్కడ చూసేసరికీ త్రాచుపాము బుసబుసలు.. చివరకు

ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా