రెబల్ స్టార్… ఈ పదం వినగానే సినిమా ప్రియుల్లో అదో రకమైన ఉత్సాహం. ఇన్నాళ్లు ఉరకలు వేసిన ఈ ఆనందం, ఇప్పుడు మూగబోయింది. రెబల్ అభిమానుల్లో మాత్రమే కాదు, యావత్ సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇక లేరు. రెబల్ స్టార్‌గా పాపులర్ అయిన కృష్ణం రాజు సొంతపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు సినిమా కథానాయకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలియగానే ప్రభాస్ హుటాహుటిన ఏఐజీకి చేరుకున్నారు.