4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
టాలీవుడ్ నటుడు జగపతి బాబు తన ఆస్తి నష్టం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దానధర్మాలు, వ్యసనాలు, కుటుంబ ఖర్చులు, మోసపోవడమే తన కోట్లు కోల్పోవడానికి నాలుగు కారణాలని తెలిపారు. డబ్బు కన్నా ఆనందమే ముఖ్యమన్న ఆయన, సంపదపై తన ప్రత్యేక దృక్పథాన్ని వివరించారు.
టాలీవుడ్ నటుడు జగపతి బాబు తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా వెలుగొందిన ఆయన, ప్రస్తుతం విలన్‌గా, తండ్రిగా, అన్నగా వివిధ పాత్రల్లో రాణిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నికర విలువ గురించి మాట్లాడిన జగపతి బాబు, వేల కోట్లు పోగొట్టుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. హోస్ట్ మీ నెట్ వర్త్ ఎంత? అని అడిగినప్పుడు, “మై వర్త్ ఈజ్ మై నెట్ వర్త్” అని తెలివిగా సమాధానం ఇచ్చారు. అదనపు సున్నాల వల్ల ప్రయోజనం లేదని, అవి ఇబ్బందులు మాత్రమే తెస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తన ఆస్తి గ్యాంబ్లింగ్‌లో పోలేదని స్పష్టం చేస్తూ, క్యాసినో కేవలం వినోదం కోసమేనని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :