Allu Arjun: కొత్త సంవత్సరం వేళ.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
కొత్తేడాదికి ప్రజలంతా స్వాగతం పలికారు. కోటి ఆశలతో కొత్తేడాదిలోకి అడుగుపెట్టారు. ఇక గడిచిన కాలాన్ని నెమరువేసుకుంటూ, కొత్తేడాది జీవితం ఎలా ఉండాలో ప్లాన్స్ వేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. గతేడాది తాము ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న విషయాలను ప్రస్తవిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా నెట్టింట ఇలాంటి పోస్ట్‌లు చేస్తున్నారు.
కొత్తేడాదికి ప్రజలంతా స్వాగతం పలికారు. కోటి ఆశలతో కొత్తేడాదిలోకి అడుగుపెట్టారు. ఇక గడిచిన కాలాన్ని నెమరువేసుకుంటూ, కొత్తేడాది జీవితం ఎలా ఉండాలో ప్లాన్స్ వేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. గతేడాది తాము ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న విషయాలను ప్రస్తవిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా నెట్టింట ఇలాంటి పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే అందులో ఐకాన్ స్టార్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 2023లో తాను ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న విషయాలను వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు అల్లు అర్జున్ . ఇంతకీ బన్నీ చేసిన పోస్ట్‌లో ఏముందంటే.. “2023లో నా అద్భుత ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 2023 నాకు అన్ని విధాలుగా ఒక అద్భుమైన ఏడాది. ఈ సంవత్సరంలో నేను చాలా అందమైన, ముఖ్యమైన, విలువైన పాఠాలను నేర్చుకున్నాను. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. అందమైన ఈ 2023 సంవత్సరానికి ఎంతో కృతజ్ఞతతో వీడ్కోలు పలుకుతున్నాను. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూఇయర్ 2024” అని కాస్త ఎమోషనల్‌గా రాసుకొచ్చారు బన్నీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ Vs కన్నడ స్టార్ హీరో.. మొదలైన నయా రగడ..
ప్రభాస్‌ను దింపిన హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్