Sabdham Movie Review : శబ్దం సినిమా రివ్యూ.. ఆది పినిశెట్టి మూవీ హిట్టా, ఫట్టా..?

కోలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అతడు నటించిన చిత్రాలన్ని తెలుగులోకి డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే తెలుగులో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. అటు విలన్ పాత్రలలోనూ అదరగొట్టారు. తాజాగా శబ్దం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు.

Updated on: Feb 28, 2025 | 10:17 PM

నటుడు ఆది పినిశెట్టి.. డైరెక్టర్ అరివ‌ళ‌గ‌న్‌ ల‌ది సక్సెస్‌ ఫుల్ కాంబో..! వీళ్ల నుంచి ఇప్పటికే వ‌చ్చిన ‘వైశాలి’ మంచి విజయం సాధించింది. హార‌ర్ థ్రిల్ల‌ర్స్‌లో జానర్ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచింది. అలాంటి వీరిద్దరూ కలిసి ఇప్పుడు శబ్దం సినిమాతో మన ముందుకు వచ్చారు. తమకు అచ్చొచ్చిన హారర్ జానర్లోనే ఈ సినిమానూ మలిచారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. అందరి అంచనాలను అందుకుందా లేదా? అందర్నీ భయపెడుతుందా? లేదా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం..