AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లెపూలకే లచ్చ ఫైను.. ఎయిర్ పోర్టులో హీరోయిన్ కు వింత అనుభవం

మల్లెపూలకే లచ్చ ఫైను.. ఎయిర్ పోర్టులో హీరోయిన్ కు వింత అనుభవం

Phani CH
|

Updated on: Sep 11, 2025 | 7:44 PM

Share

మల్లెపూల మాలను బ్యాగులో పెట్టుకుని విదేశాలకు వెళ్లడం.. నేరమని తెలుసా? దానికి భారీగా జరిమానా కట్టాల్సి వస్తుందనే విషయం తెలుసా? తెలీదు కదా! మలయాళ నటి నవ్య నాయర్‌కు కూడా తెలీదట. అందుకే ఇదే పొరపాటు చేసి.. తన స్టోరీతో .. తన ఎక్స్‌పీరియన్స్‌తో ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనం వేడుకలను నిర్వహించింది.

ఈ వేడకల్లో పాల్గొనేందుకు తాజాగా నటి నవ్య నాయర్‌ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో దిగిన సమయంలో ఆమె బ్యాగ్‌లో 15 సెంటీ మీటర్ల మల్లెపూల మాల ఒకటి కనిపించింది. దీంతో మెల్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆమెను ఆపి, మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్‌ విధించారు. దీంతో ఆమె ఒక్క సారిగా షాకైనంత పనైంది! దీని గురించి తన ఫ్యాన్స్‌కు చెబుతూ బాధపడింది. తాను ఆస్ట్రేలియాకు రాకముందు తన కోసం తన నాన్న మల్లెపూలు తీసుకువచ్చాడని.. చెప్పిన నవ్య.. వాటిని రెండు భాగాలుగా చేసి.. ఒక భాగం కొచ్చి నుంచి సింగపూర్‌కు వెళ్లేటప్పుడు తన తలలో పెట్టుకున్నానని .. రెండో భాగం బ్యాగులో పెట్టుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఎందుకంటే తాను అక్కడికి చేరుకునే సమయానికి మల్లెల్లు వాడిపోతాయి కాబట్టి.. . సింగపూర్‌ నుంచి తదుపరి ప్రయాణంలో మిగిలిన పూలు పెట్టుకోవచ్చని.. అనుకుందట. అందుకే వాటిని హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉంచుకున్నానంటూ చెప్పింది. అయితే తాను చేసింది చట్ట విరుద్ధమనే విషయం తనకు తెలీదంటూ తన అనుభవాన్ని ఓన్ వేడుకల్లో అందరితో పంచుకుంది ఈ బ్యూటీ. తన బ్యాగులో మల్లెపూల మాల ఉండడంతో.. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు రూ.1.14 లక్షలు జరిమానా విధించినట్టు చెప్పుకొచ్చింది. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. తెలియకుండా చేసిన తప్పంటూ నవ్య చెప్పుకొచ్చింది. అయితే ఈమె షేర్ చేసిన ఈ వింత అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో మీమ్‌గా తెగ తిరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: కాంబో ప్యాక్.. కాంతార టికెట్ కొంటే ప్రభాస్ మూవీ ట్రైలర్ ఫ్రీ | AA 22 నుంచి అనుకోని అప్‌డేట్

రూటు మార్చిన నాగ వంశీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో.. ఆంజనేయుడి యానిమేషన్ మూవీ

‘డాక్యుమెంటరీనే కాదు డబల్ హెడేక్‌’ చిక్కుల్లోకి నయన్‌.. హైకోర్టుకు కొత్త నోటీసులు

చిన్న జీతంతో సంతోషంగా బతికా.. ఇప్పుడు లక్షల జీతంతో నరకం చూస్తున్నా

పెళ్లిళ్లు ఆపేసిన మేకలు, గొర్రెలు.. కారణం ఇదే