A.R. Rahman: ‘ఎవరినీ బలవంతం చేసి మతం మార్చరు’
దిలీప్ కుమార్ గా జన్మించిన ఏ ఆర్ రెహమాన్, తరువాత సూఫీయిజం ప్రభావంతో ఇస్లాంను స్వీకరించారు. ఈ మార్పుకు కారణాలేంటో నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. మతం పేరుతో ఇతరులని హింసించడం తనకు అస్సలు నచ్చదనీ ప్రతి సంగీత వేదిక తనకు ఒక పుణ్యస్థలంలా అనిపిస్తుందనీ భిన్న మతాలు, భిన్న భాషల నుంచి వచ్చిన ప్రజలు సంగీతం ద్వారా ఒక్కటవుతారని అన్నారు.
దిలీప్ కుమార్ గా జన్మించిన ఏ ఆర్ రెహమాన్, తరువాత సూఫీయిజం ప్రభావంతో ఇస్లాంను స్వీకరించారు. ఈ మార్పుకు కారణాలేంటో నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. మతం పేరుతో ఇతరులని హింసించడం తనకు అస్సలు నచ్చదనీ ప్రతి సంగీత వేదిక తనకు ఒక పుణ్యస్థలంలా అనిపిస్తుందనీ భిన్న మతాలు, భిన్న భాషల నుంచి వచ్చిన ప్రజలు సంగీతం ద్వారా ఒక్కటవుతారని అన్నారు. సూఫీయిజం పట్ల తన ఆకర్షణను రెహమాన్ వివరించాడు. తన దృష్టిలో సూఫీయిజం అనేది అహంకారాన్ని, కోరిక, దురాశ, అసూయ వంటి ప్రతికూల మానవ లక్షణాలను తొలగించి, దైవత్వంలో ఐక్యం కావడానికి చేసే ఆధ్యాత్మిక ప్రయాణమని చెప్పుకొచ్చారు. ప్రతికూల భావనల తెరలు తొలగితేనే ప్రేమ, దయ వంటి లక్షణాలకు మనం దగ్గరవుతామని వివరించారు. ఏ మతాన్ని అనుసరించినా… చివరికి నమ్మకం, నిజాయితీ, మంచి పనులు మాత్రమే ముఖ్యమని రెహమాన్ అభిప్రాయపడ్డారు. సూఫీ మార్గంలో ఎవరినీ బలవంతం చేసి మతం మార్చరనీ ఇది హృదయం నుంచి వచ్చే నిర్ణయమనీ చెప్పారు. తనకు, తన తల్లికి ఆధ్యాత్మికంగా ఇది సరైన మార్గం అనిపించిందనీ స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందగత్తెల రీయూనియన్.. సందడి.. సందడి చేసిన ముద్దుగుమ్మలు
AR Rahman: మాటలు కాదు.. ముందు మ్యూజిక్ మీద దృష్టి పెట్టు
తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు
Sreeleela: శ్రీలీల భారీ ప్లానింగ్.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా
