Jani Master: జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!

Updated on: Sep 17, 2024 | 11:32 AM

ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాష అలియాస్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. జానీ.. గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు 21ఏళ్ళ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్‌ తనను వేధించారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జానీపై 376, 506, 323 (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు చాలా సంచలన విషయాలను ప్రస్తావించింది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాష అలియాస్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. జానీ.. గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు 21ఏళ్ళ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్‌ తనను వేధించారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జానీపై 376, 506, 323 (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు చాలా సంచలన విషయాలను ప్రస్తావించింది. జానీ మాస్టర్ కు తనకు ఢీ12 షోలో పరిచయం ఏర్పడిందని.. 2019లో జానీమాస్టర్‌ కాల్‌ చేసి తన గ్రూపులో జాయిన్ చేసుకుంటానని తెలిపినట్లుగా ఆ యువతి పేర్కొంది. కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ దాని తరువాత పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ప్రతిఘటిస్తే కొట్టి, హింసించే వారని బాధితురాలు పేర్కొంది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని.. లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారంది. షూటింగ్‌ వానిటీ వ్యాన్‌లో ఎన్నొసార్లు వేధించారని బాధితురాలు ఆరోపించింది. అందరిముందే అసభ్యంగా టచ్‌ చేసేవారని, తన ఇంటికి వచ్చి జానీ మాస్టర్‌ భార్య పలుమార్లు కొట్టారని కూడా బాధితురాలు పేర్కొంది. తాను ఎదుర్కొన్న వేధింపులు.. తిన్న దెబ్బలు.. ఓ దశలో పెళ్లి ప్రపోజల్.. ఆ తర్వాత జానీ మాస్టర్ భార్య కూడా ఎంటరవ్వడం.. ఇవన్నీ ఆ FIRలో చెప్పుకొచ్చింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ సహా వివిధ నగరాల్లో అవుట్‌ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ...