గిరిజనులను గడగడలాడిస్తున్న గజరాజులు.. అటవీ అధికారి మృతి

|

Sep 20, 2023 | 9:53 AM

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఆర్మోరి, ఖుర్కెడ, ధానోరా, దేశాయి గంజ్ తాలుకా అటవీ ప్రాంతాల్లో ఏనుగుల గుంపు చొరబడి ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ఒడిశా అటవీ ప్రాంతం నుండి చత్తీస్ గడ్ మీదుగా ఓ ఏనుగుల గుంపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి జనాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఏ క్షణం ఎవరిమీద దాడిచేస్తాయోనని స్థానికులు క్షణ క్షణం భయం భయంగా గడుపుతున్నారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఆర్మోరి, ఖుర్కెడ, ధానోరా, దేశాయి గంజ్ తాలుకా అటవీ ప్రాంతాల్లో ఏనుగుల గుంపు చొరబడి ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ఒడిశా అటవీ ప్రాంతం నుండి చత్తీస్ గడ్ మీదుగా ఓ ఏనుగుల గుంపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి జనాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఏ క్షణం ఎవరిమీద దాడిచేస్తాయోనని స్థానికులు క్షణ క్షణం భయం భయంగా గడుపుతున్నారు. పంట పొలాలను నాశనం చేయడంతో పాటు స్థానికులపై దాడులు చేస్తుండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది ఏనుగుల గుంపును తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో గస్తీ కాసేందుకు వెళ్లిన అటవీ శాఖ ఉద్యోగి ఆత్రం హరిదాస్ పై ఏనుగులు దాడి చేసి హతమార్చాయి. పడాస్ గావ్, దొంగర్ గావ్ రోడ్డు మీదుగా వాహనంపై ఆత్రం హరిదాస్ డ్యూటీకి వెళ్లి వస్తుండగా రోడ్డుకు అడ్డంగా ఉన్న ఏనుగుల గుంపు అతని వాహనాన్ని ధ్వంసం చేసి హరిదాస్ ను తొక్కి చంపేశాయి. దీంతో అటవీ శాఖ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Birth Certificate: అక్టోబర్ 1 నుంచి బర్త్‌ సర్టిఫికేట్ కొత్త రూల్స్ !!

Indian Railways: ఇకపై భారత్ రైళ్ళలో లోయర్ బెర్త్‌లు వారికే !!

Aditya-L1: పరిశోధనలు ప్రారంభించిన ఆదిత్య ఎల్‌1 సూర్యుడి దిశగా ప్రయాణం !!

బ్యాక్టీరియా సోకిన చేప తిని.. కాళ్లూచేతులు పోగొట్టుకున్న మహిళ !!

దొంగ చేతికి తాళాలు అంటే ఇదేనేమో !! సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు