Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించే అద్భుతమైన డ్రింక్‌.. రోజూ పరగడుపున తాగితే.!

|

Jul 27, 2024 | 4:37 PM

ఇటీవల కాలంలో మనం తినే ఆహారం కారణంగా అయితేనేమి, ఇతర కారణాలైతేనేమి ఊబకాయానికి గురవుతున్నారు. ఈ బెల్లీఫ్యాట్‌ సమస్య చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనిని తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు అద్భుతమైన డ్రింక్‌ను సజెస్ట్‌ చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. దీంతో బాడీలోని కొలెస్ట్రాల్‌ కరిగించడంలో సాయపడుతుంది.

ఇటీవల కాలంలో మనం తినే ఆహారం కారణంగా అయితేనేమి, ఇతర కారణాలైతేనేమి ఊబకాయానికి గురవుతున్నారు. ఈ బెల్లీఫ్యాట్‌ సమస్య చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనిని తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు అద్భుతమైన డ్రింక్‌ను సజెస్ట్‌ చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. దీంతో బాడీలోని కొలెస్ట్రాల్‌ కరిగించడంలో సాయపడుతుంది. ఈ డ్రింక్‌ ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉందంటున్నారు. ఈ డ్రింక్‌ తయారు చేసుకోడానికి ఒక లీటరు మంచినీళ్లు, ఒక కీర దోసకాయ, ఒక నిమ్మకాయ, ఒక స్పూను అల్లం తురుము, ఓ పది పదిహేను పుదీనా ఆకులు ఉంటే చాలు. లీటరు నీటిలో దోసకాయను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి వేయండి. అలాగే నిమ్మకాయను కూడా గుండ్రంగా చక్రాల్లా కోసి అవి కూడా ఆ నీటిలో వేయండి. అలాగే అల్లం సన్నగా తురిమి ఒక స్పూను వరకూ వేయండి, పుదీనా అకులు కూడా వేసి బాగా కలపండి. ఈ నీటిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి. మర్నాడు ఈ నీటిని తీసుకొని దాహం వేసినప్పుడల్లా ఈ నీటిని తాగండి. ఖాళీ కడుపుతో తాగితే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు.

ఈ డీటాక్స్ డ్రింక్ పరగడుపున తాగితే మూత్ర విసర్జన ద్వారా శరీరం నుండి అదనపు నీటిని బయటికి పంపుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. లివర్ హెల్దీగా మారుతుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. డీటాక్స్ చేస్తుంది. శరీరానికి, నోటికి మంచి బూస్టింగ్ ఉంటుంది. పుదీనా ఆకులు పొట్టని మృదువుగా ఉంచుతాయి. ఇది నోటిని కూడా రీఫ్రెష్ చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. జీర్ణక్రియని మెరుగుపరచడంలో సాయపడుతుంది. పుదీనా ఆకుల్లోని మెంథాల్ గుణాలు శ్వాసని ఫ్రెష్ చేయడమే కాకుండా నాడీ వ్యవస్థని తాజాగా ఉంచుతాయి. దీని వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది.​దోసకాయలో మితంగా మూత్రవిసర్జన లక్షణాలు ఉన్నాయి. ఇందులోని ప్రోటీన్స్ జీర్ణక్రియని ప్రేరేపించే ఎంజైమ్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ దోసకాయ కలిపిన డ్రింక్ తాగితే మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది. కొవ్వులని కరిగించి మూత్రం ద్వారా బయటికి పంపుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సాయపడుతుంది. ఈ డీటాక్స్ డ్రింక్‌లో నిమ్మరసం కలుపుతారు కనుక దీని వల్ల బరువు తగ్గుతారు. నిమ్మలో సహజ మూత్ర విసర్జన లక్షణాలు, ఆల్కలీన్ లక్షణాలు ఉన్నాయి. ఇవి pH స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులోని అల్లం ఈ పానీయానికి మంచి వాసన, రుచిని అందిస్తుంది. ప్రేగుల పనితీరును క్రమబద్దీకరించి, పెద్దప్రేగు క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on