Earth Quake: అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5 తీవ్రతగా నమోదు
వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో..
అస్సాంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. మోరిగావ్ జిల్లాలో అర్ధరాత్రి 2:25కి భూ ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గౌహతితోపాటు పలుచోట్ల ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. అటు భూమికి 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. ఇక రెండు రోజుల క్రితమే కోల్‌కతా సమీపంలో బంగాళాఖాతంలోనూ ఇదే తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు కూడా ఈ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ఇప్పుడు అసోంలో ఎర్త్‌క్వేక్‌తో ఒక్కసారిగా అలజడి రేగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Feb 27, 2025 06:58 AM
వైరల్ వీడియోలు
Latest Videos

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
