మీరు నీళ్లు నిలబడి తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Updated on: Oct 21, 2025 | 2:37 PM

మనిషి బ్రతకాలంటే గాలి ఎంత ముఖ్యమో.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు అంతే ముఖ్యం. శరీరంలో తగినంత నీరు లేకపోతే శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయవు. బాడీ ఎంత హైడ్రేట్‌గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. నీటిద్వారా శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అయితే ఈ నీళ్లు తాగడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది.

ఎలాపడితే అలా తాగితే అది ఆరోగ్యానికి మంచిదికాదంటున్నారు నిపుణులు. నీరు తాగేటప్పుడు పాటించాల్సిన పద్ధతిపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నిలబడి నీళ్లు తాగకూడదు అని చెబుతుంటారు. నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని భావిస్తారు. దీని వెనుక ఉన్న నిజం ఏమిటో, నిలబడి నీరు తాగడం వల్ల నిజంగా ఏ నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం. నిపుణునల అభిప్రాయం ప్రకారం.. నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లు దెబ్బతింటాయి, ఇతర కీళ్లపై ప్రభావం చూపుతుందనే ఆలోచన ఒక అపోహ మాత్రమే. నిలబడి తాగేటప్పుడు నీరు అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వేగంగా వెళుతుంది. దీనికి మోకాళ్లకు ప్రత్యక్ష సంబంధం లేదు. నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లకు నేరుగా హాని కలగకపోయినా.. ఇది జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలపై ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిలబడి నీరు త్రాగితే, నీరు అన్నవాహిక ద్వారా వేగంగా కడుపులోకి వెళుతుంది. ఈ వేగం జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలు రావొచ్చు. అంతేకాదు, నిలబడి తాగినప్పుడు అది సిరలపై ఒత్తిడి తెస్తుంది. కాలక్రమేణా కీళ్లలో ద్రవం పేరుకుపోవడం లేదా ద్రవ సమతుల్యత దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిలబడి నీరు త్రాగితే అది ఫిల్టర్ కాకుండా వేగంగా కడుపులోకి వెళ్లిపోతుంది. దీనివల్ల నీటిలోని మలినాలు మూత్రాశయంలో పేరుకుపోతాయి. ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. నిలబడి నీరు త్రాగినప్పుడు, అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థ ద్వారా సరిగ్గా గ్రహించుకోవు. నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలోని ద్రవ సమతుల్యత దెబ్బతింటుందని, నరాలలో ఉద్రిక్తత ఏర్పడుతుందని కూడా చెబుతారు. ఆయుర్వేదం ప్రకారం.. నీటిని ఎల్లప్పుడూ కూర్చుని, హాయిగా చిన్నగా సిప్‌ చేస్తూ కొద్ది కొద్దిగా తాగాలి. తొందరపడి నిలబడి లేదా నడుస్తున్నప్పుడు నీరు త్రాగకూడదు. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనుషుల మానసిక ఒత్తిడికి కారణం.. వారి పొట్టలోని పేగులా ??

మహిళల్లోనే ఎక్కువ డిప్రెషన్‌ ఎందుకు? పరిశోధనల్లో బయటపడ్డ కీలక విషయాలు!

యువతకు హెచ్చరిక! మలంలో రక్తమా? క్యాన్సర్‌కు సంకేతం!