ఎండు చేపలను ఇష్టంగా తింటున్నారా.. డేంజర్‌ సుమా

Updated on: Jan 19, 2026 | 8:43 PM

ఎండు చేపలు రుచి, పోషకాల సమ్మేళనం. కాల్షియం, ప్రొటీన్లు ఎముకలు, దంతాలకు బలం చేకూరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, పాలిచ్చే తల్లులకు మేలు చేస్తాయి. అయితే, అధిక ఉప్పు కారణంగా రక్తపోటు, గుండె, కిడ్నీ సమస్యలున్నవారు, డయాబెటిస్ బాధితులు జాగ్రత్తగా ఉండాలి. పెరుగు, ఆకుకూరలతో కలిపి తినడం సురక్షితం కాదు. వైద్య సలహా ముఖ్యం.

ఎండు చేపల పేరు చెబితేనే చాలా మందికి నోరూరిపోతుంది. గ్రామీణప్రాంతాల్లో వీటికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. రుచిలో మాత్రమే కాదు, పోషకాల విషయంలోనూ ఎండు చేపలు మెండు. ఇందులో ఉండే కాల్షియం, ప్రోటీన్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఎండు చేపలు అందరికీ ఆరోగ్యకరం కాకపోవచ్చు. వీటిని ఎండబెట్టే ప్రక్రియలో వాడే అధిక ఉప్పు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు కలిగిస్తుంది. అసలు ఎండు చేపలు ఎందుకు తినాలి? ఎవరు దూరంగా ఉండాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చేపలను ఎండబెట్టి నిల్వ చేసే విధానం మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఎండు చేపలు తినేటప్పుడు రుచితో పాటు ఆరోగ్య నియమాలను కూడా పాటించడం అవసరం. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు ఉన్నవారు ఎండు చేపల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల పాలిచ్చే తల్లులకు మేలు జరుగుతుందనేది వాస్తవమే అయినా, కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదకరంగా మారవచ్చు. ఎండు చేపలు తినడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు మరియు దంతాలను దృఢంగా మారుస్తాయి. ఇందులోఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి. మహిళల గర్భాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలోను, పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో ఎండు చేపలు సహాయపడతాయి. ఇక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు ఎండుచేపలు తినకపోవడమే మంచిది. ఎండు చేపలను నిల్వ చేయడానికి అధిక మొత్తంలో ఉప్పు వాడుతారు. ఇది రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తీసుకోకపోవడం మంచిది. చర్మసమస్యలు..దురద, దద్దుర్లు లేదా స్కిన్ అలర్జీలు ఉన్నవారు వీటిని తింటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా మారే అవకాశం ఉన్నందున మధుమేహ బాధితులు కూడా వీటిని పరిమితంగానే తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎండు చేపలను ఎప్పుడూ పెరుగు, మజ్జిగ లేదా ఆకుకూరలతో కలిపి తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

జుట్టు రాలిపోతోందా.. ఈ డ్రింక్‌ ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం

ఎముకలకు పుష్టినిచ్చే ఆహారాలు ఇవే

ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం.. అమర్‌నాథ్ కు ప్రయాణం ఇక్కడి నుంచే..

సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ