AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: భర్త కోసం భార్య.. టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే భార్య ఏం చేస్తుందో తెలుసా

AP Politics: భర్త కోసం భార్య.. టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే భార్య ఏం చేస్తుందో తెలుసా

Balu Jajala
|

Updated on: Apr 15, 2024 | 11:50 AM

Share

ఏపీలో ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నా.. మరోవైపు టికెట్ కోసం నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. ర్యాలీలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తూ హైకమాండ్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోసం భార్య మహాలక్ష్మి 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది.

ఏపీలో ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నా.. మరోవైపు టికెట్ కోసం నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. ర్యాలీలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తూ హైకమాండ్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోసం భార్య మహాలక్ష్మి 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. తన భర్త రామకృష్ణారెడ్డికి టీడీపీ కూటమని నుండి అనపర్తి టిక్కెట్ ఇవ్వాలని, హైకమాండ్ ద్రుష్టికి తీసుకెళ్లేందుకు రామకృష్ణారెడ్డి భార్య స్వగ్రామం రామవరం నుండి మహేంద్రవాడ, కొప్పవరం, కొమరిపాలెం, తోస్సిపూడి, పందలపాక, ఊలపల్లి మీదుగా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయానికి పాదయాత్ర చేశారు.

పాదయాత్రగా బిక్కవోలు చేరుకుని లక్ష్మీ గణపతికి మొక్కు చెల్లించారు. రామకృష్ణారెడ్డి అభిమానులు కార్యకర్తలు… టిడిపి అధిష్టానం అనపర్తి అభ్యర్థిత్వం రామకృష్ణారెడ్డికే అని సంకేతాలు రావడంతో కుటుంబ సభ్యులు ముమ్మరంగా ప్రచారం. ఇప్పటికే 12 రోజులు పాటు రామకృష్ణ రెడ్డి సహా కుటుంబ సభ్యులందరూ ఇంటింటా ప్రచారం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Apr 15, 2024 11:47 AM