Okra Water: ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!

|

Mar 19, 2024 | 11:20 AM

బెండకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. దీంతో ఎన్నో రకాల వంటకాలు తయారుచేస్తాం. కొందరు పచ్చి బెండకాయలు కూడా తింటారు. అయితే బెండకాయను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నాలుగు లేత బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి, నిలువుగా, అడ్డంగా ముక్కలుగా కోసి మంచినీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ నీటిని వడపోసి తాగాలి.

బెండకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. దీంతో ఎన్నో రకాల వంటకాలు తయారుచేస్తాం. కొందరు పచ్చి బెండకాయలు కూడా తింటారు. అయితే బెండకాయను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నాలుగు లేత బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి, నిలువుగా, అడ్డంగా ముక్కలుగా కోసి మంచినీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ నీటిని వడపోసి తాగాలి. దీంతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. బెండకాయలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి,బి, ఫోలిక్ యాసిడ్, పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, ఫెన్నెల్ వాటర్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. బెండకాయలో మాంగనీస్ ఉంటుంది. ఇది జీవక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణకు కీలకమైన ఖనిజం. బెండకాయలో విటమిన్ A,C మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. ఇది చర్మం వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది. మచ్చలు ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బెండకాయ రోగనిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. బెండకాయలో ప్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కళ్లకు , ఎముకలకు బెండకాయ చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ మంచి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెండకాయలు నానబెట్టిన నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెండకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచడంలో బెండకాయ సహాయపడుతుంది. బరువు తగ్గడానికి, రక్తపోటు నియంత్రణలో బెండకాయ సహాయపడుతుంది. ముఖ్య గమనిక ఏంటంటే…ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని ప్రయోగించేముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on