హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. ఎన్నేళ్ల జైలుశిక్షో తెలుసా ??

|

Oct 07, 2024 | 5:37 PM

హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే ఉపయోగించకూడదన్నారు. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో అనుమతిస్తామని.. సౌండ్‌ సిస్టమ్‌కు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరంటూ ఆనంద్ పేర్కొన్నారు. మతపరమైన ర్యాలీల్లో బాణసంచా కాల్చడం కూడా నిషేధమన్నారు.

హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే ఉపయోగించకూడదన్నారు. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో అనుమతిస్తామని.. సౌండ్‌ సిస్టమ్‌కు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరంటూ ఆనంద్ పేర్కొన్నారు. మతపరమైన ర్యాలీల్లో బాణసంచా కాల్చడం కూడా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని హైదరాబాద్‌ సీపీ ఆనంద్ స్పష్టం చేశారు. సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరని.. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబిల్స్ ను నిర్దేశించినట్లు సీపీ తెలిపారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబెల్స్ కి మించి సౌండ్ సిస్టం వాడరాదన్నారు. రాత్రి వేళలో 45 డేసిబెల్స్ కి మించి సౌండ్ సిస్టం ఉపయోగించకూడదన్నారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు రూ.5000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??

వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!

అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు

క్యాష్ ఆన్ డెలివరీపై రూ.లక్షన్నర ఐఫోన్‌ ఆర్డర్‌ !! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక ??

తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి దుమారం.. టీటీడీ ఏం చెప్పింది ??