Diwali: టపాసుల్లా కార్బైడ్ గన్‌ను పేల్చి .. కంటి చూపు కోల్పోయిన 14 మంది

Updated on: Oct 25, 2025 | 11:25 AM

దీపావళి పండగ అంటేనే రకరకాల టపాసులు కాలుస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో టపాసుల రకాలు వైరల్ అయ్యాయి. పండుగ వేళ..వైరల్ అయిన టపాసులే ఇప్పుడు 14 మంది పిల్లల కంటి చూపును పోగొట్టాయి. మరో వంద మందికి పైగా వీటి కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ దీపావళి పలువురు చిన్నారుల జీవితాల్లో శాశ్వతంగా చీకటిని నింపటంపై వారి కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన కార్బైడ్ గన్ లేదా దేశీ ఫైర్‌క్రాకర్ గన్ పేరుతో వచ్చిన కొత్త ట్రెండ్ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు పీడకలగా మారింది. 3 రోజుల్లోనే మధ్యప్రదేశ్‌లో 122 మందికి పైగా చిన్నారులు ఈ ప్రమాదకరమైన బాణసంచాను కాల్చి తీవ్ర కంటి గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో 14 మంది చిన్నారులు పూర్తిగా కంటి చూపు పోగొట్టుకోవటం.. ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. కార్బైడ్‌ గన్‌లను సాధారణంగా రైతులు కొనుగోలు చేసి వాడతారు. కోతుల బెడద నుంచి పంటను కాపాడటానికి ఉపయోగిస్తారు. అయితే దీపావళి టపాసులాగా వాడాలంటూ సోషల్ మీడియాలో కార్బైడ్ గన్‌లు వైరల్ అయ్యాయి. అలర్టయిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 18న నిషేధం విధించింది. అయినప్పటికీ విదిషా జిల్లా మార్కెట్లలో బహిరంగంగా ఈ కార్బైడ్‌ గన్ ల అమ్మకాలు జరిపారు. ప్లాస్టిక్ లేదా టిన్ పైపులను ఉపయోగించి.. వాటిలో గన్‌పౌడర్, అగ్గిపుల్లల తలలు, కాల్షియం కార్బైడ్ నింపి.. వాటికి రంధ్రం ద్వారా నిప్పు అంటించేలా తయారుచేసారు. ఈ రసాయనాలు కలిసి మండడం వలన అది బాంబులా పేలి ముఖంపై, కళ్లపై నేరుగా ప్రభావం చూపిందని డాక్టర్లు అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కళ్యాణమండపానికి వచ్చిన అనుకోని అతిథి

వ్యాపారులకు దొంగబాబాల బురిడీ.. పౌడర్‌ చల్లి.. డబ్బుతో పరార్‌

మహిళలకు ఆన్‌లైన్ ఉగ్రవాద కోర్సు

అమెరికా విద్యార్థి వీసా రూల్స్ మరింత కఠినం.. భారత విద్యార్థులకు ఇబ్బందే

సౌదీలో బానిసత్వ చట్టం రద్దు.. మనోళ్లకు స్వేచ్ఛ