Honey: తేనెతో లాభాలే కాదు నష్టాలూ ఎక్కువే.. అవేంటో తెలుసా.?

తేనెలో చక్కెర, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే తేనెను ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు వేగంగా పెరిగే అవకాశం ఉందంటున్నాయి అధ్యయనాలు. తేనెకు వేడిచేసే గుణం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదులో తేనెను తీసుకుంటే జీర్ణక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. జీర్ణప్రక్రియ నెమ్మదించి, కడుపు నొప్పిని కలిగిస్తుంది. తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో మంట సమస్య కూడా పెరిగే చాన్స్ ఉందట.

Honey: తేనెతో లాభాలే కాదు నష్టాలూ ఎక్కువే.. అవేంటో తెలుసా.?

|

Updated on: Apr 09, 2024 | 9:55 PM

తేనె ఆగోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అందుకే చాలామంది వివిధ రూపాలలో తేనెను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ తేనెను పరిమితికి మించి తీసుకుంటే ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం. తేనెలో చక్కెర, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే తేనెను ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు వేగంగా పెరిగే అవకాశం ఉందంటున్నాయి అధ్యయనాలు. తేనెకు వేడిచేసే గుణం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదులో తేనెను తీసుకుంటే జీర్ణక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. జీర్ణప్రక్రియ నెమ్మదించి, కడుపు నొప్పిని కలిగిస్తుంది. తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో మంట సమస్య కూడా పెరిగే చాన్స్ ఉందట. మెల్లమెల్లగా జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

తేనె ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో మధుమేహం బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని ఆహార పానీయాలలో తేనెను ఉపయోగించవద్దు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు తేనె చాలా హానికరం. తేనె ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ సమస్య వస్తుంది. ఇది అలెర్జీ సమస్యలను కూడా కలిగిస్తుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు కావచ్చు. తేనె దంతాలకు కూడా హానికరం. తేనె తాగేప్పుడు అది పళ్లకు అంటుకోవడం వల్ల పళ్ల చుట్టూ బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ బ్యాక్టీరియా దంతాలు, చిగుళ్ళకు హాని చేస్తుంది. క్రమంగా దంతాలు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. అలాగే, ఎక్కువ వేడి నీటిలో తేనె ఎప్పుడు తాగకూడదు. గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలే గానీ అలా అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles