BJP Focus on Hyderabad: పాతబస్తీపై నజర్ వేసిన అమిత్ షా.. ఇవాళ గల్లీగల్లీలో పర్యటన

హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. ప్రచారంలో దూకుడు పెంచింది. మాధవీలతకు మద్దతుగా ఇవాళ రోడ్‌ షో నిర్వహించనున్నారు అమిత్‌ షా. లాల్‌ దర్వాజా నుంచి శాలిబండ సుధాటాకిస్‌ వరకు సాగే ఈ రోడ్‌ షోపై ఆసక్తి నెలకొంది.

BJP Focus on Hyderabad: పాతబస్తీపై నజర్ వేసిన అమిత్ షా.. ఇవాళ గల్లీగల్లీలో పర్యటన
Amit Shah
Follow us

|

Updated on: May 01, 2024 | 8:00 AM

హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. ప్రచారంలో దూకుడు పెంచింది. మాధవీలతకు మద్దతుగా ఇవాళ రోడ్‌ షో నిర్వహించనున్నారు అమిత్‌ షా. లాల్‌ దర్వాజా నుంచి శాలిబండ సుధాటాకిస్‌ వరకు సాగే ఈ రోడ్‌ షోపై ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్ లోక్‌సభ స్థానంపై బీజేపీ అధిష్ఠానం స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటున్నారు బీజేపీ నేతలు. పాతబస్తీలో తిరుగులేని శక్తిగా ఉన్న MIMకి ధీటుగా ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను బరిలోకి దించిన బీజేపీ.. ఈసారి అసదుద్దీన్‌ను ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకుంది.

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవీలత.. పాతబస్తీలో గల్లీగల్లీని చుట్టేస్తున్నారు. మాధవీలతకు దీటుగా ప్రచారం చేస్తున్న MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా పాతబస్తీలో ఎలక్షన్‌ హీట్‌ పెంచుతున్నారు. అయితే ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్‌షా మాధవీలతకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు. లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్‌లో అమిత్ షా ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రోడ్‌ షోను ప్రారంభించనున్నారు. లాల్‌ దర్వాజా నుంచి శాలిబండ సుధాటాకిస్‌ వరకు అమిత్‌ షా రోడ్‌ షో కొనసాగనుంది.

పాతబస్తీలో అమిత్‌ షా పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే అమిత్‌ షా రోడ్‌ షో నిర్వహించే ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. రోడ్‌ షో అనంతరం అమిత్‌ షా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు.

తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. హైదరాబాద్‌ ఎంపీ సీటును సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు దూసుకెళ్తోంది. పాతబస్తీలో అమిత్‌ షా ఎన్నికల ప్రచారంతో పొలిటికల్‌ హీట్ మరింత పీక్స్‌కు చేరనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..
మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి.. బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి.. బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
ఇక తగ్గేదేలే.. ఫుల్లుగా వర్షాలు.. ఐదురోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఇక తగ్గేదేలే.. ఫుల్లుగా వర్షాలు.. ఐదురోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
థార్ కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై రూ.10 వేల పెంపు..
థార్ కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై రూ.10 వేల పెంపు..