Watch: డీజీల్‌ ట్యాంకర్‌ దగ్ధం.. రహదారిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌

|

Sep 16, 2024 | 8:15 PM

క‌డప జిల్లాలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. జిల్లాలోని మాధవరం- 1 గ్యాస్ గోడౌన్ వద్ద డీజీల్ ట్యాంకర్ లారీలో ఆక‌స్మాత్తుగా మంటలు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన లారీ డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ సుర‌క్షితంగా ప్రాణాల‌తో బ‌య‌ట‌పడ్డారు. ఈ ప్ర‌మాదంతో

క‌డప జిల్లాలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. జిల్లాలోని మాధవరం- 1 గ్యాస్ గోడౌన్ వద్ద డీజీల్‌ లారీలో ఆక‌స్మాత్తుగా మంటలు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన లారీ డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ సుర‌క్షితంగా ప్రాణాల‌తో బ‌య‌ట‌పడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ ప్ర‌మాదంతో కడప- చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్ప‌డింది. రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..