షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ
ఆధునిక జీవనశైలితో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. చాలామంది చక్కెర బదులు బెల్లం, తేనెను ఆరోగ్యకరంగా భావిస్తారు. అయితే, ఈ రెండింటిలోనూ కేలరీలు అధికం. బెల్లం గ్లైసెమిక్ ఇండెక్స్ తెల్ల చక్కెర కంటే ఎక్కువ (80-85). దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. తేనెను కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. డయాబెటిస్ రోగులు, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.
ఈ రోజుల్లో డయాబెటిస్‌తో చాలా మంది బాధపడుతున్నారు. కొందరు ప్రీ డయాబెటిస్ దశలో ఉండటం చూస్తున్నాం. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. చాలా మంది చక్కెరను వాడటం మానేస్తున్నారు. ఎందుకంటే ఇది షుగర్ లెవల్స్ పెంచుతుందని వారికి తెలుసు. అయితే, చక్కెర బదులు బెల్లం , తేనె మంచివి అనుకుని వాటిని వాడుతున్నారు. బెల్లం, తేనె రెండూ ఆరోగ్యానికి మంచివే. ఈ రెండింటిలో మంచి పోషకాలు ఉన్నాయి. కానీ బెల్లం, తేనెలో కేలరీలు ఎక్కువ. దీంతో బరువు పెరగడం, రక్తంలో గ్లూకోజ్ పెరిగే ప్రమాదం ఉంది. తేనె ప్రయోజనాలను పొందాలని అనుకుంటే మాత్రం చాలా తక్కువ మోతాదులో కంట్రోల్‌గా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనం తాతల కాలం నుంచి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వింటూ వచ్చాం. బెల్లం తక్కువ ప్రాసెస్ చేయబడింది. ఇది కొంతవరకు నిజం. బెల్లంలో చక్కెరలో లేని ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి కొన్ని సూక్ష్మ పోషకాలున్నాయి. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. అదే గ్లైసెమిక్ ఇండెక్స్. బెల్లం గ్లైసెమిక్ ఇండెక్స్ 80 నుంచి 85 వరకు ఉంటుంది. దీనర్థం బెల్లం రక్తంలో షుగర్ లెవల్స్‌ని తెల్ల చక్కెర కంటే వేగంగా పెంచుతుంది. తేనె విషయంలో కూడా నియంత్రణ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేం ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే
నేటి తాజా వార్తా.. నగరం లో ముసుగు దొంగలు సంచరిస్తున్నారు జాగ్రత్త
BSNL నుంచి అద్భుత ప్లాన్!రూ. 251కే 100 GB డేటా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
