AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

500 లీటర్ల పెట్రోల్‌తో భారీ బ్లాస్ట్‌ !! క్లైమాక్స్‌ అదిరింది !!

500 లీటర్ల పెట్రోల్‌తో భారీ బ్లాస్ట్‌ !! క్లైమాక్స్‌ అదిరింది !!

Phani CH
|

Updated on: May 01, 2026 | 7:13 PM

Share

"ధురంధర్‌ 2" క్లైమాక్స్ దర్శకుడు ఆదిత్యధర్ విజన్‌తో గ్రాఫిక్స్ లేకుండా, వాస్తవికంగా రూపొందింది. స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ విశాల్ త్యాగి 500 లీటర్ల పెట్రోల్, 25 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించి, రణ్‌వీర్‌ భద్రతకు భంగం కలగకుండా భారీ పేలుళ్లను చిత్రీకరించారు. ఈ థ్రిల్లింగ్ క్లైమాక్స్ సినిమా విజయానికి దోహదపడింది, రూ.1800 కోట్లు వసూలు చేసింది.

‘ధురంధర్‌ 2’ లో పవర్‌ఫుల్‌ క్లైమాక్స్‌తో దర్శకుడు ఆదిత్యధర్‌ ఇంతకుమించి ఏం కావాలి అన్నంతగా థ్రిల్‌ చేశారు. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో క్లైమాక్స్‌ రణరంగాన్ని తలపించాయి. భారీ పేలుళ్లతో క్లైమాక్స్‌ సీన్‌ కోసం గ్రాఫిక్స్‌పై ఆధారపడలేదని, రియలిస్టిక్‌గానే రూపొందించామని స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ విశాల్‌ త్యాగి తెలిపారు. దీని కోసం దాదాపు 500 లీటర్ల పెట్రోల్‌ వినియోగించినట్టు చెప్పారు. ‘‘ఫైర్‌ ఉన్న సీన్ల కోసం గ్రాఫిక్స్‌ వద్దు అని దర్శకుడు ఆదిత్యధర్‌ ముందుగానే చెప్పారట. అన్నింటి కన్నా ఆఖరిలో వచ్చే బ్లాస్ట్‌ను తీయడానికి చాలా కష్టపడ్డాం అన్నారు. ఆ విషయంలో రణ్‌వీర్‌ సపోర్ట్‌ ఉన్నప్పటికీ.. ఆయన భద్రత విషయంలో ఆందోళన చెందామని తెలిపారు. 500 లీటర్ల పెట్రోల్‌తో షూటింగ్‌ అంటే ఎలా ఉంటుందో ఊహించండి. పక్కా ప్రణాళికతో ఆ సెగ.. రణ్‌వీర్‌కు తాకకుండా మేనేజ్‌ చేసామని చెప్పారు. 250 లీటర్ల ఇంధనమే వాడాలని ప్రొడక్షన్‌ టీమ్‌ సూచించింది. 500 లీటర్ల ఉంటేనే అవుట్‌పుట్‌ బాగా వస్తుందని చెప్పి, వారిని ఒప్పించాననీ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ విశాల్‌ త్యాగి చెప్పారు . 25 కేజీల పేలుడు పదార్థం వాడామనీ త్యాగి చెప్పారు. షూటింగ్‌ పూర్తయ్యాక.. అద్భుతమంటూ తనను, టీమ్‌ని రణ్‌వీర్‌ మెచ్చుకున్నారంటూ విశాల్‌ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సూపర్‌హిట్‌ మూవీ ‘ధురంధర్‌’కు కొనసాగింపుగా రూపొందిన ‘ధురంధర్‌ 2’ మార్చిలో విడుదలైంది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ దాదాపు రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి

ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది

ఉస్మానియా వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్

కదులుతున్న రైలుపై అగ్నికీలలు.. చివరిలో షాకింగ్‌ ట్విస్ట్‌

వీడుతున్న ముంబై పుచ్చకాయ మరణాల మిస్టరీ

Follow Us