ధనత్రయోదశి ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

Updated on: Oct 20, 2025 | 4:20 PM

ధనత్రయోదశి పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన ధరలకు బ్రేక్ పడింది. శనివారం బంగారంపై దాదాపు రూ.3,000, వెండిపై రూ.13,000 వరకు ధర తగ్గింది. ఆదివారం అక్టోబర్ 19న ఉదయం కూడా ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివిధ నగరాల్లోని తాజా ధరలను ఇక్కడ చూడండి.

హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ధనత్రయోదశి దీపావళికి ముందు వస్తుంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ క్రమంలో, బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త అందింది. గత కొన్ని నెలలుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు అడ్డుకట్ట పడింది. శనివారం ఒక్కరోజే బంగారం ధర దాదాపు రూ.3,000 వరకు తగ్గింది. వెండి ధర కూడా రూ.13,000 వరకు పడిపోయింది. ఈ ధరల పతనం శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఆదివారం, అక్టోబర్ 19న ఉదయం కూడా ఈ ధరలు స్థిరంగా నమోదయ్యాయి.