మహానంది ఆలయానికి రుద్రాక్ష మండపం

|

Dec 06, 2023 | 10:01 AM

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహానంది ప్రముఖమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో కొలువైన ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయానికి భక్తుల నుంచి కానుకలు ఆభరణాలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన SBI రిటైర్డ్ మేనేజర్ మారం వెంకటసుబ్బయ్య దంపతులు 35 కేజీల వెండితో తయారు చేయించిన రుద్రాక్ష మండపాన్ని ఆలయానికి విరాళంగా అందించారు.

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహానంది ప్రముఖమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో కొలువైన ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయానికి భక్తుల నుంచి కానుకలు ఆభరణాలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన SBI రిటైర్డ్ మేనేజర్ మారం వెంకటసుబ్బయ్య దంపతులు 35 కేజీల వెండితో తయారు చేయించిన రుద్రాక్ష మండపాన్ని ఆలయానికి విరాళంగా అందించారు. రుద్రాక్ష మండపం గర్భాలయంలో స్వామి వారికి పై భాగాన అలంకరిస్తారు. వెండితో తయారు చేసిన రుద్రాక్ష మండపాన్ని ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డికి దాతలు అందజేశారు. కార్తీక మూడవ సోమవారం సందర్భంగా ఆలయంలో సంప్రోక్షణ అనంతరం దాతల కుటుంబీకులు శ్రీ మహానంధీశ్వర స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించి రుద్రాక్ష మండపాన్ని అందజేశారు. దాతలు వెంకటసుబ్బయ్యకు కుటుంబీకులకు ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరింత మంది భక్తులు విరాళాలు అందజేశి ఆలయ అభివృద్ధి లో భాగస్వాములై స్వామి,అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బురద ఉత్సవం.. ఆరోజు ఊళ్లోవాళ్లంతా బురద పూసుకోవాల్సిందే

బీచ్ లో ఈత కొడుతున్న మహిళ కాలును తినేసిన షార్క్

తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే !!

పాపం !! ఇదేం లొల్లి అయ్యా.. వదిలేయొచ్చు కదా ఆ రైతు బిడ్డను..

ఇదేం కొట్టుడురా మామ.. వింటుంటే ఒళ్లు ఊగుతాంది..

 

Follow us on