వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌లో చంద్రబాబు మనవడు.. ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్‌గా నారా దేవాన్ష్‌

Updated on: Sep 15, 2025 | 5:05 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అతి చిన్న వయసులోనే క్లిష్టమైన 175 చెస్ పజిల్స్‌ను పరిష్కరించి “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్” అవార్డ్ అందుకున్నాడు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి నారా లోకేష్, బ్రాహ్మణి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాన్స్‌కు అభినందనలు తెలిపారు. గురువుల మార్గనిర్దేశంలో నెలలపాటు కష్టపడి ఈ ఘనత సాధించాడని పేర్కొన్నారు. 175 పజిల్స్‌లో ఫాస్టెస్ట్‌ చెక్‌మేట్‌ సాల్వర్‌ రికార్డు పట్ల గర్విస్తున్నానని అన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును సెప్టెంబర్‌ 14న వెస్ట్‌మినిస్టర్ హాల్లో దేవాన్ష్ ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇదో ప్రత్యేకమైన ఘనతని వ్యాఖ్యానించారు. ఒక తండ్రిగా పుత్రోత్సాహం పొందుతున్నానని హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదను పెడుతూ , ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాన్ష్ చెస్‌ నేర్చుకున్నాడని తెలిపారు. అతడి కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని అన్నారు. అటు దేవాన్ష్ అవార్డ్ సాధించడంపై టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్, ఆయన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. దేవాన్ష్ అకుంఠిత శ్రమతో పాటు, తల్లి నారా బ్రాహ్మణి, తండ్రి నారా లోకేశ్‌, కోచ్ కే. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహం అందించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్ నెలలో దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల వయస్సులోనే ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నారు. వ్యూహాత్మకమైన ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్‌ను దేవాన్ష్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో తాజాగా.. లండన్‌లో నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ ప్రదానోత్సవంలో నిర్వాహకుల చేతుల మీదుగా దేవాన్ష్ అవార్డు అందుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Report: నైరుతి తిరోగమనం.. 3 రోజులు ముందుగానే

Honey Trap: హనీ ట్రాప్‌లో యోగా గురువు.. ఆ తర్వాత

దొంగల ముఠాకు దిమ్మదిరిగే షాకిచ్చిన మేకలు

Prabhas: ‘మిరాయ్’కి ప్రభాస్ ఎంత తీసుకున్నారంటే..?

మరణంలోనూ వీడని బంధం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతి