ఢిల్లీ ఎర్రకోట పేలుడు.. సూసైడ్ బాంబర్ షూలోనే ట్రిగ్గర్ ??

Updated on: Nov 20, 2025 | 3:57 PM

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు సంచలనం రేపుతోంది. ఉగ్రవాది ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి తన 'షూ'లోని మెటల్ భాగాన్ని ట్రిగ్గర్‌గా వాడినట్లు అనుమానిస్తున్నారు. 'మదర్ ఆఫ్ సాతాన్' TATP పేలుడు పదార్థంగా వినియోగించారు. ఉన్నత విద్యావంతులు భాగమైన 'వైట్ కాలర్' ఉగ్రవాద నెట్‌వర్క్, హవాలా నిధులపై NIA లోతుగా విచారణ జరుపుతోంది.

ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. i20 కారులో పేలుడు పదార్థాలతో వచ్చిన ఉగ్రవాది ఉమర్ నబీ, మెట్రో స్టేషన్ వద్ద తనను తాను పేల్చుకున్నాడు. ఘటనా స్థలంలో డ్రైవర్ సీటు కింద దొరికిన అతడి.. షూ దర్యాప్తును కొత్త మలుపు తిప్పింది. ఈ షూ లోపల ఉన్న మెటల్ భాగాన్ని ట్రిగ్గర్‌గా వాడి ఉండవచ్చని ఎన్ఐఏ అనుమానిస్తోంది. కారు శకలాల మధ్య లభించిన ఓ చీలిన పాదం కూడా దాడి చేసిన ఉగ్రవాదిదేనని భావిస్తున్నారు. సూసైడ్ బాంబర్ తన ‘షూ’లోనే ట్రిగ్గర్ మెకానిజం అమర్చుకుని ఉంటాడనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ NIA విచారణ జరుపుతోంది. ‘మదర్ ఆఫ్ సాతాన్’గా పిలిచే ట్రైయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ ను ఈ దాడిలో వాడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు కారు తునాతునకలైంది. ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 2001లో రిచర్డ్ రీడ్ అనే ఉగ్రవాది విమానం పేల్చేందుకు ‘షూ బాంబ్’ ట్రిగ్గర్‌ మెకానిజంనే వాడాడు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన జైష్‌ ఉగ్రవాది ఉమర్‌ నబీ. అక్టోబర్ 30న అతడి సహచరుడు డాక్టర్‌ అహ్మద్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉమర్ పరారయ్యాడు. ఈ ఉగ్రవాద మాడ్యూల్‌లో ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు ‘వైట్ కాలర్’ నెట్‌వర్క్‌గా పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలంలో 9ఎంఎం తూటాలు కూడా లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మెవాట్ ప్రాంతంలోని హవాలా నెట్‌వర్క్ ద్వారా నిధులు సమకూరినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో ఇప్పటికే ఒక సహాయకుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నూహ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తూ దర్యాప్తును ముమ్మరం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైరసీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే.. ఆ పని చేయాల్సిందే..

అల్లు అర్జున్‌తో పోటీ.. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఏమన్నారు ??

Rajamouli: ఇంటర్నేషనల్‌ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న.. మరీ ఇంత అడ్వాన్స్ గానా

సిల్వర్ స్క్రీన్ మీద రిపీట్‌ అవుతున్న జోడీలు.. మళ్లీ కుదురుతున్నట్టేనా ??

Nayanthara: సింహా జోడీకి సూపర్‌క్రేజ్‌.. మహారాణి వచ్చేస్తున్నారహో