50శాతం మంది మాత్రమే ఆఫీస్ కు వెళ్లాలన్న ప్రభుత్వం

Updated on: Nov 25, 2025 | 10:36 PM

ఢిల్లీలో ప్రమాదకరమైన వాయు కాలుష్యం దృష్ట్యా, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. అత్యవసర సేవల ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం, ముఖ్యంగా వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. పర్యవరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 5 నిబంధన ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులలో 50 శాతం మంది ఇంటి నుంచే తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. మిగిలిన సగం మంది మాత్రమే కార్యాలయాలకు హాజరు కావాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వన్డే సిరీస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

చైనా ఓవరాక్షన్‌.. భారత మహిళపై వేధింపులు

PM Modi: ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలన్న ప్రధాని మోదీ

బద్దలైన అగ్నిపర్వతం.. భారత్‌పై ప్రభావం.. పలు విమానాలు రద్దు

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే