Musi River: ఉగ్రరూపంలో మూసీ నది.. హైదరాబాద్‌కు అలెర్ట్..

Musi River: ఉగ్రరూపంలో మూసీ నది.. హైదరాబాద్‌కు అలెర్ట్..

Ravi Kiran

|

Updated on: Jul 27, 2022 | 12:30 PM

Musi River: భారీవర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. చిన్నపాటి వర్షం పడినా ఎగువప్రాంతాల నుంచి వచ్చే వరదతో హైదరాబాద్ నగర ప్రజలు భయంతో వణికిపోతున్నారు.



భారీవర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. చిన్నపాటి వర్షం పడినా ఎగువప్రాంతాల నుంచి వచ్చే వరదతో హైదరాబాద్ నగర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చెరువుల సుందరీకరణ పనుల్లో అధికారులు చేపడుతున్న అనాలోచిత చర్యలు ప్రజల పాలిట శాపంగా మారాయి. హైదరాబాద్‌ నగరంలో నీళ్ళు మూసీ ద్వారానే బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌ మధ్య నుండి మురికి నీరు బయటకు పోయేందుకు మూసీ ఒక్కటే మార్గం. అలాంటి మూసీ నది వెడల్పూ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆక్రమణల పర్వంతో ఇప్పటికే మూసీ నది రివర్‌బెడ్‌ నలభైశాతం తగ్గినట్లు తెలుస్తుంది. మూసీ నదిని ఆక్రమించుకొని ఎన్నో ఆక్రమణలు జరుగుతున్నప్పటికి ఇప్పటి వరకు ఏప్రభుత్వం సరియైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడే అనేక కాలనీలు ముంపుకు గురవ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published on: Jul 27, 2022 11:29 AM