ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌

|

Dec 05, 2024 | 11:28 AM

గంటలకొద్దీ కదలకుండా కూర్చుంటున్నారా? అయితే గుండెకు చేటు తెచ్చిపెట్టుకుంటున్నట్టే. ఎక్కువసేపు కూర్చునే వారికి గుండె జబ్బుతో మరణించే ముప్పు పెరుగుతున్నట్టు మాస్‌ జనరల్‌ బ్రైగమ్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అతిగా కూర్చునేవారు వ్యాయామాలు చేసినా అవి గుండెజబ్బు ముప్పును తగ్గించడానికి సరిపోవటం లేదనీ పరిశోధకులు గుర్తించారు.

ఉదయమో, సాయంత్రమో బాగానే వ్యాయామం చేస్తున్నాం కదా, ఎక్కువసేపు కూర్చున్నా ఏమీ కాదని చాలామంది భావిస్తుంటారు. ఇది తప్పని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. వ్యాయామాలు, శారీరక శ్రమ చేసినా బద్ధకంగా ఎక్కువసేపు గడిపితే గుండెజబ్బు ముప్పు అలాగే పొంచి ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. చురుకుగా గడిపే సమయాన్ని పెంచుకుంటే వీటి ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఈ అధ్యయనంలో కూర్చుంటున్న సమయానికీ భవిష్యత్‌ గుండెజబ్బుల ముప్పులకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోస్టాఫీసులకు మహిళల పరుగు.. తీరా అకౌంట్ ఓపెన్ చేస్తే..

వింటర్‌లో ఇవి తింటే.. బాడీకి ఫుల్ పవర్

వీడేం దొంగరా బాబు.. ఇంత ట్యాలెంటడ్ గా ఉన్నాడు

మోక్షు హీరోగా ‘ఆదిత్య 369’ సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలయ్య

ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరో.. ఏంటీ పిచ్చి నిర్ణయం