AP News: చేపలు పడుదామని వెళ్లి కళ్లు తేలేసిన వ్యక్తి.. నీటిలో కనిపించింది చూడగా

|

Dec 17, 2024 | 9:09 AM

కర్నూలు జిల్లా బానకచర్ల గ్రామం దగ్గర నిప్పుల వాగుపైన ఉన్న కేసీ కెనాల్లో మరోసారి మొసలి ప్రత్యక్షమైంది. గత ఐదు రోజులుగా కేసీ కేనాల్లో సంచరిస్తూ రైతులకు, మత్స్యకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మొసలి.

వణ్యప్రాణులు ఈ మధ్యకాలంలో తమ ఆవాసాలను వదిలిపెట్టేసి.. వెకేషన్ కోసం జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయ్. తరచూ ఇలాంటి ఘటనలు చాలానే చూసి ఉంటాం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయ్. తాజాగా ఈ తరహ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని పాములపాడు మండలం బానకచర్ల గ్రామం దగ్గర నిప్పుల వాగుపైన ఉన్న కేసీ కెనాల్‌లో మరోసారి మొసలి ప్రత్యక్షమైంది. గత ఐదురోజులుగా కేసీ కెనాల్‌లో సంచరిస్తూ రైతులకు, మత్స్యకారులకు కునుకు లేకుండా చేస్తోంది. మొసలిని చూసిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వారి సిబ్బందితో కలిసి వచ్చి కేసీకెనాల్‌లో మొసలి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. మొసలిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేయగా చీకటి పడడంతో వెను తిరిగివెళ్లారు. ఉదయం మొసలిని బంధించి కృష్ణా నదిలో వదులుతామని తెలిపారు. కేసీకెనాల్ పరిసరాల రైతులు, ప్రజలు నీళ్లలోకి దిగకుండా అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ అదికారులు తెలియజేశారు.

ఇది చదవండి: 

శివారు పొలంలో పని చేస్తుండగా ఏదో అలికిడి.. అటు వెళ్లి చూడగా బిత్తరపోయిన రైతు

గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..