Loading video

Watch: పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత.. వైరల్‌గా మారిన వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

|

Sep 02, 2024 | 1:58 PM

రామ మందిరం సమీపంలో ఓ గోమాత విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఆకలితో అలమటిస్తూ వచ్చిన ఓ పిల్ల వరాహం ఎలాంటి భయం లేకుండా గోమాత దగ్గరకు వెళ్లి పాలు తాగింది. అయినా ఆ గోమాత పిల్ల వరాహాన్ని బెదరగొట్టకుండా పాలిచ్చింది. కాగా, ఇదంతా ఎవరో స్థానికులు వీడియో తీసి ఇంటర్‌నెట్‌లో పోస్ట్‌ చేశారు.

ఆకలి అందరికీ ఒకటే.. అలాగే, అమ్మ కూడా.. తల్లి ప్రేమకు సాటి ఈ లోకంలో ఏది లేదన్నది జగమేరిగిన సత్యం. అలాంటి తల్లి వద్దకు ఆకలితో వచ్చిన ఎవరినైనా సరే సంతృప్తి పరుస్తుందని అనేందుకు ఇది కూడా ఒక నిదర్శనమే. ఆకలి‌తో అలమటిస్తున్న పంది పిల్ల ఆవు తల్లి పాలిచ్చిన వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని పాతపట్నంలో గల రామ మందిరం సమీపంలో ఓ గోమాత విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఆకలితో అలమటిస్తూ వచ్చిన ఓ పిల్ల వరాహం ఎలాంటి భయం లేకుండా గోమాత దగ్గరకు వెళ్లి పాలు తాగింది. అయినా ఆ గోమాత పిల్ల వరాహాన్ని బెదరగొట్టకుండా పాలిచ్చింది. కాగా, ఇదంతా ఎవరో స్థానికులు వీడియో తీసి ఇంటర్‌నెట్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో నెట్టింట వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వీడియోపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..