Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కీలక అప్ డేట్.. వీడియో.

|

Jan 06, 2023 | 6:48 PM

అయోధ్యలోని రామ మందిరంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఆలయ నిర్మాణ పనులు 2024 జనవరి 1 నాటికి పూర్తవుతాయని ప్రకటించిన అమిత్ షా మందిర ప్రారంభోత్సవ వేడుకలు కూడా అదే రోజున జరుగుతాయని పేర్కొన్నారు.

త్రిపురలోని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా ‘ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రామ మందిర సమస్యను కాంగ్రెస్‌ అడ్డుకుంది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం ప్రధాని మోదీ ఆగస్టు 5, 2020న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం ప్రారంభమైంది’ అని అన్నారు. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలు 2024లోనే  జరగనున్నాయి. దాదాపు ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రానున్న ఎన్నికలలో కూడా తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. ఇక ఈ నేపథ్యంలో రామ మందిరంపై అమిత్ షా చేసిన ప్రకటన బీజేపీకి ఎంతో బలాన్ని ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 06, 2023 06:27 PM