Telangana: నడిరోడ్డుపై పడగవిప్పి తాచుపాము బుసలు.. బాబోయ్

Edited By:

Updated on: Sep 10, 2025 | 3:58 PM

హనుమకొండలోని నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై నాగుపాము ప్రత్యక్షమవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్డుపైకి వచ్చిన నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టింది. వాహనదారులు షాక్ అవుతూ ఈ దృశ్యాన్ని చరవాణిలో చిత్రీకరించి అవాక్కయ్యారు. ఈ సంఘటన హనుమకొండలోని నక్కలగుట్ట ఎన్పీడీసీఎల్ సర్కిల్ వద్ద చోటు చేసుకుంది.

హనుమకొండలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై నాగుపాము ప్రత్యక్షమవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. రోడ్డుపైకి వచ్చిన నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టింది. రహదారిపై నాగుపామును చూసి షాక్ అయిన వాహనదారులు చరవాణిలో చిత్రీకరించి అంతా అవాక్కయ్యారు. ఈ పాము హనుమకొండలోని నక్కలగుట్ట ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం సర్కిల్ లో ప్రత్యక్షమైంది.. పక్కనే ఉన్న చెట్లనుండి రోడ్డుపైకి వచ్చిన పొడవాటి నాగుపాము రోడ్డుపై ముడుచుకొని పడగవిప్పి బసలు కొట్టింది.. దాదాపు గంటకు పైగా  పాము అక్కడే తిష్ట వేయడంతో అందరూ భయాందోళన చెందారు.
కొందరు ప్రత్యేక చొరచూపి ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా తిరిగి మళ్లీ పొదల్లోకి వెళ్లాలా చేశారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి పైన ఈ విధంగా పాము ప్రత్యక్షమవడం అందరిని ఆచరణ గురిచేసింది.. ఇంతపెద్ద పాము ఎలా రోడ్డుపైకి వచ్చిందని ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Sep 10, 2025 03:55 PM