భూమిపై యజమానికే సర్వహక్కులు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

రాజకీయ స్వార్థంతో ల్యాండ్‌ టైటిల్‌ చట్టం గురించి అబద్ధాలు చెప్పడం చాలా దారుణమని సీఎం జగన్‌ అన్నారు. భూయజమానులకు ఎంతో మేలు చేసే చట్టం ఇది అని తెలిపారు. రిజస్ట్రేషన్‌ చేసుకున్న వారికి జిరాక్స్ పేపర్లు ఇస్తారని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. భూములకు..

Updated on: May 08, 2024 | 9:11 PM

రాజకీయ స్వార్థంతో ల్యాండ్‌ టైటిల్‌ చట్టం గురించి అబద్ధాలు చెప్పడం చాలా దారుణమని సీఎం జగన్‌ అన్నారు. భూయజమానులకు ఎంతో మేలు చేసే చట్టం ఇది అని తెలిపారు. రిజస్ట్రేషన్‌ చేసుకున్న వారికి జిరాక్స్ పేపర్లు ఇస్తారని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. భూములకు సంబంధించి ఇదొక పెద్ద సంస్కరణ అని అన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఎంతో సులభతరం చేశామని వెల్లడించారు. మార్పు అనేది దేశవ్యాప్తంగా జరుగుతోందని, ఇది ఏపీకి పరిమితమైన విషయం కాదని జగన్‌ తెలిపారు. వందేళ్ల తర్వాత సర్వే చేసి.. భూ రికార్డులు సిద్దం చేశామన్నారు. భూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం. 17 వేల గ్రామాల్లో రికార్డులు పూర్తయ్యాయి. టైటిల్స్‌లో తప్పులు లేకుండా చూడటమే ప్రభుత్వం గ్యారంటీ. భూములకు ఇన్సూరెన్స్ ఉంది. సచివాలయాలనే రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా మార్చాం అని వెల్లడించారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us