AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: 71 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల స్పీడ్.. చిరంజీవి లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Phani CH
|

Updated on: Aug 23, 2026 | 4:49 PM

Share

71 ఏళ్ల వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’తో భారీ విజయం అందుకున్న చిరు, ‘విశ్వంభర’, బాబీ దర్శకత్వంలోని మెగా 158 సినిమాలతో బిజీగా ఉన్నారు. 2027 సంక్రాంతికి మెగా 158 విడుదల కానుండగా, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలనే లక్ష్యంతో చిరు ముందుకు సాగుతున్నారు.

వయసు 71 ఏళ్లు కానీ ఆయన జోరు మాత్రం ఇప్పటికీ 20 ఏళ్లే.. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తున్నారు చిరంజీవి. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస సినిమాలతో స్పీడ్ పెంచేస్తున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన లైనప్‌పై ఓ లుక్కేద్దామా..? ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అనడానికి చిరంజీవే నిదర్శనం. బాస్ స్పీడ్ చూస్తుంటే బాక్సాఫీస్ లెక్కలు తారుమారవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 2026 మొదట్లోనే వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఏకంగా 350 కోట్లకు పైగా వసూలు చేసి తన స్టామినా చూపించారు చిరు.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఊపులో అక్టోబర్‌లో విశ్వంభరతో ఆయన మరోసారి బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు. విశ్వంభర వచ్చినా రాకపోయినా.. బాబీతో చేస్తున్న మెగా 158 మాత్రం సంక్రాంతికి రానుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతుంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా చాలా కొత్తగా కనిపించబోతున్నారు. అనస్వర రాజన్ ఇందులో చిరు కూతురుగా నటిస్తున్నారు. 2027 సంక్రాంతి బరిలో దిగడానికి ముస్తాబవుతోంది మెగా 158. బాబీ సినిమా పూర్తయ్యాక శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉండబోతుంది.. నాని ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అక్కడితో ఆగకుండా ఏడాదికి కనీసం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు చిరు. మంచి కథ ఉంటే సినిమా చేయడానికి తాను సిద్ధం అంటూ ఈ జనరేషన్ డైరెక్టర్లందరికీ చిరు బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. వయసు 71 ఏళ్లు కానీ ఆయన స్పీడ్ మాత్రం ఇంకా 20ల్లోనే ఉండిపోయింది.. ఇప్పటికీ అదే ఫిట్‌నెస్, అదే స్టైలిష్ లుక్స్ మెయింటేన్ చేస్తూ దూకుడు చూపిస్తున్నారు చిరంజీవి.. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు.. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తున్నారు.. 2025లో గ్యాప్ తీసుకున్నా 2026 మొదట్లోనే మన శంకరవరప్రసాద్ గారుతో 350 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్ కొట్టారు.. ఇప్పుడు బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్.. దీని షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది.. 2027 సంక్రాంతికి సినిమా రానుంది.. ఇందులో తనను తాను కొత్తగా ఆవిష్కరించబోతున్నారు.. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో టీనేజ్ అమ్మాయి తండ్రిగా నటిస్తున్నారు చిరు.. కూతురుగా అనస్వర రాజన్ నటిస్తున్నారు.. అన్నీ కుదిర్తే అక్టోబర్‌లోనే విశ్వంభర విడుదల కానుంది.. బాబీ సినిమా అవ్వగానే శ్రీకాంత్ ఓదెలతో సినిమా సెట్స్‌పైకి రానుంది.. ఆ తర్వాత కూడా వరస సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు చిరంజీవి.. ఈ జనరేషన్ దర్శకులందరికీ ఓపెన్ ఆఫర్స్ ఇస్తున్నారు మెగాస్టార్..

Follow Us