Samatha Kumbh 2024: 108 దివ్యదేశాలు సమతామూర్తి ద్వితీయ బ్రహ్మోత్సవాలు.. లైవ్.
Chinna Jeeyar Swamy Participate In Samatha Kumbh 2024 Brahmotsavams Live Video On 22 02 2024 Telugu News Video

Samatha Kumbh 2024: 108 దివ్యదేశాలు సమతామూర్తి ద్వితీయ బ్రహ్మోత్సవాలు.. లైవ్.

Updated on: Feb 22, 2024 | 1:43 PM

22-02-2024 గురువారం రోజు ఉదయం అష్టాక్ష‌రి మంత్ర జ‌పంతో ప్రారంభ‌మైంది. అనంత‌రం ప్రాత‌స్మ‌ర‌ణీయం, యాగ‌శాలలో సేవాకాలం, శాత్తుముఱై నిర్వ‌హించారు. త్రిదండి చిన‌జీయ‌ర్‌స్వామివారు భ‌క్తుల‌కు తీర్ద‌ప్ర‌సాదం అనుగ్ర‌హించారు. త‌ర్వాత భ‌క్తుల‌కు పెద్ద‌లు అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. పూర్ణాహుతితో ఉద‌యం కార్య‌క్ర‌మం పూర్త‌యింది.

22-02-2024 గురువారం రోజు ఉదయం అష్టాక్ష‌రి మంత్ర జ‌పంతో ప్రారంభ‌మైంది. అనంత‌రం ప్రాత‌స్మ‌ర‌ణీయం, యాగ‌శాలలో సేవాకాలం, శాత్తుముఱై నిర్వ‌హించారు. త్రిదండి చిన‌జీయ‌ర్‌స్వామివారు భ‌క్తుల‌కు తీర్ద‌ప్ర‌సాదం అనుగ్ర‌హించారు. త‌ర్వాత భ‌క్తుల‌కు పెద్ద‌లు అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. పూర్ణాహుతితో ఉద‌యం కార్య‌క్ర‌మం పూర్త‌యింది.

తిరుమంజన సేవ గురించి..

ముందురోజు సాయంత్రం గరుడ సేవలో పాల్గొన్న పెరుమాళ్ళకి సామూహిక తిరుమంజన సేవలు నిర్వహించారు. ఇది అపూర్వమైన అద్భుత దర్శనం. 18 మంది పెరుమాళ్ళకి ఒకే వేదికపై తిరుమంజన సేవలు జరగడం అనేది చాలా అరుదు. కేవలం ఈ క్షేత్రంలోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. తిరువీధియాత్రలో గరుడారూఢుడై వేంచేసిన స్వామివారికి అలుపు తీరడం కోసం ఏకాంతంగా జరిపే తిరుమంజన సేవను ఇక్కడ భక్తులందరూ సేవించుకునేలా నిర్వహించారు. 108 మంది పెరుమాళ్ళు వేంచేసిన ఈ క్షేత్రంలో జరిగేవన్నీ అపూర్వమే. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కొత్తగానే ఉంటాయని అన్నారు. ఇంత వరకు ఏకంగా 18 రూపాల్లో ఒకేసారి తిరుమంజనం ఎక్కడా జరగలేదు. సాధారణంగా కార్యక్రమం చూసేవాళ్లకు కొత్తగా ఉంటుంది. కానీ ఇక్కడ చేసేవాళ్లకు, చేయించేవాళ్లకు కూడా ప్రపథమ అపూర్వ అనుభూతి కలుగుతుంది. తిరుమంజనంలో భాగంగా పెరుమాళ్ళకు ముందుగా పెరుగుతో స్నానం చేయించారు. తర్వాత పాలు, తేనె, ఫలరసాలు, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఇలాంటి ద్రవ్యాలనే ఆయుర్వేదంలో పంచకర్మలలో కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల దేహానికి శ్రమ తొలగిపోయి కొత్త శక్తి ఏర్పడుతుంది. అందుకే ఈ తిరుమంజనం నిర్వహించారు. తిరుమంజన సేవ రోజుకు 18 మంది చొప్పున మొత్తం 108 మంది పెరుమాళ్ళకు గరుడసేవ తర్వాత రోజు తిరుమంజన సేవను నిర్వహించారు.

శ్రీరామానుజ నూత్తందాది పారాయణ..

భగవద్రామానుజులకి సామూహికంగా రామానుజ నూత్తందాది పారాయణ రూపంలో శరణాగతి చేయటం ఈ నాటి కార్యక్రమం విశేషం. అందాది అనేది శ్లోక రచనలో లేదా పాశురాలలో ఒక అద్భుతమైన ప్రక్రియ. మొదటి పాశురం ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాతి పాశురం ప్రారంభం కావడాన్ని అందాది అంటారు. అంటే అంతంలో ఉన్నది మరొకదానికి ఆది కావడం అన్నమాట. దీనినే సంస్కృతంలో ముక్త పదగ్రస్తము అంటారు. అలా వరుసగా ముందు పాశురంలోని చివరి పదంతో మొదలు పెడుతూ నూరు పాశురాలు రామానుజుల వైభవం పాడితే అదే ‘రామానుజ నూత్తందాది’ అవుతుంది. ఈ రామానుజ నూత్తందాదిని ప్రపన్న గాయత్రిగా మన పెద్దలు కీర్తిస్తారు. సాక్షాత్తుగా భగవద్రమానుజులు వేంచేసి ఉన్న రోజులలో వారికి శిష్యులైన తిరువరంగత్తముదనార్ అనే మహానుభావులు భగవద్రామానుజ వైభవాన్ని కీర్తించి, వారి ఆమోదాన్ని పొంది లోకానికి అందించిన ఒక అద్భుత గ్రంథం “రామానుజ నూత్తందాది”. ఇందులో రామానుజులకి ఆళ్వార్లపైన, ఆళ్వార్లు పాడిన దివ్యదేశాలపైన ఉన్న అపారమైన ప్రేమ గురించి అముదనార్ కవులు పాడారు. అందుకే రామానుజులు దీనిని అంగీకరించారు. సమతామూర్తి బ్రహ్మోత్సవాలలో ఈ గ్రంథాన్ని అనుసంధించడం ద్వారా మనమంతా భగవద్రామానుజుల కృపకి పాత్రులు కావొచ్చు. చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేదవిద్యార్థులు, అర్చకులు, ఆచార్యులు అనేక మంది భక్తులు కలిపి సమతామూర్తి సన్నిధిలో ఈ పారాయణం చేయగలగడం ఎంతో భాగ్య విశేషం.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Feb 22, 2024 08:04 AM