Hyderabad: స్వీట్స్ కొనదామని షాప్‌నకు వెళ్లారు.. ఇంతలో కారు డోర్ లాక్.. ఆ తర్వాత జరిగిందిదే
కారు డోర్ లాక్ కావడంతో ఓ చిన్నారి అరగంటసేపు కారులోనే ఉండిపోయింది. చిన్నారిని బయటకు తీసేందుకు బంధువులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు. చివరకు కారు డోర్ లాక్ తీయడంతో క్షేమంగా బయటపడింది ఆ చిన్నారి. మంచిర్యాలకు చెందిన ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి వస్తూ..
కారు డోర్ లాక్ కావడంతో ఓ చిన్నారి అరగంటసేపు కారులోనే ఉండిపోయింది. చిన్నారిని బయటకు తీసేందుకు బంధువులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు. చివరకు కారు డోర్ లాక్ తీయడంతో క్షేమంగా బయటపడింది ఆ చిన్నారి. మంచిర్యాలకు చెందిన ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి వస్తూ.. సుల్తానాబాద్‌లో కారు ఆపి స్వీట్ షాప్ లోకి వెళ్లారు. ఆ సమయంలో కారులో చిన్నారి మాత్రమే ఉంది. కారు కీ కూడా లోపలే ఉండి.. ఒక్కసారిగా డోర్ లాక్ అయ్యింది. దీంతో చిన్నారి చార్మిని బయటకు తీసేందుకు కంగారు పడ్డారు చిన్నారి బంధువులు. చివరకు ఓ యువకుడు చాకచక్యంగా పాపతో కారు డోర్ అన్‌లాక్ చేయించాడు. లాక్ అయిన కార్ డోర్ ఎలా తీయాలో యూట్యూబ్‌లో పాపకు చూపిస్తూ చిన్నారి చార్మిని బయటకు రప్పించాడు.
ఇది చదవండి: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి