తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Updated on: Nov 27, 2025 | 5:01 PM

చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గం తిరుపతి మీదుగా వెళ్లనుంది. తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు దక్షిణ మధ్య రైల్వే సవరించిన నివేదికను సమర్పించింది. ఈ మార్పు వల్ల 778 కి.మీ దూరం కేవలం 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోవచ్చు, ప్రస్తుతం పట్టే 12 గంటల సమయం గణనీయంగా తగ్గుతుంది. భూసేకరణతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

చెన్నై-హైదరాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు ఖరారు చేసి, సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికకు ఆమోదం లభిస్తే, త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. తొలుత చెన్నై నుంచి గూడూరు మీదుగా హైదరాబాద్‌కు ఈ బుల్లెట్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. అయితే, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మీదుగా ప్రాజెక్టును అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం రైల్వేకు విజ్ఞప్తి చేయడంతో… అధికారులు ఈ మార్గంలో మార్పులు చేసి, తుది నివేదికను సమర్పించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు కోసం ఒక్క తమిళనాడులోనే 223.44 హెక్టార్ల భూమి అవసరమని అక్కడి ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ఇచ్చింది. నివేదిక ప్రకారం చెన్నై సెంట్రల్, మీంజూరు వద్ద మరో స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 778 కిలోమీటర్ల దూరమున్న చెన్నై-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం 12 గంటలు సమయం పడుతుండగా.. ఇప్పుడు ఈ ప్రయాణం కేవలం 2 గంటల 20 నిమిషాలకు పరిమితం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. 2027 నాటికి సూరత్‌లో తొలి బుల్లెట్ రైలును నడపాలని లక్ష్యంగా పెట్టుకోగా, దక్షిణాదిలో చెన్నై-బెంగళూరు-మైసూరు మార్గంలోనూ భూసర్వే జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ

బైకర్‌ను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్‌

ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం