Ayodhya Dham Junction: ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం.! అయోధ్య జంక్షన్ పేరు అయోధ్యధామ్ జంక్షన్‌గా మార్పు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్‌ను అయోధ్య ధామ్ జంక్షన్ గా మార్చినట్టు వెల్లడించింది. డిసెంబర్ 30న అయోధ్య ధామ్ జంక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. స్టేషన్ పేరు మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనను తాజాగా భారతీయ రైల్వే అంగీకరించింది. అయితే, స్టేషన్ కోడ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించింది.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్‌ను అయోధ్య ధామ్ జంక్షన్ గా మార్చినట్టు వెల్లడించింది. డిసెంబర్ 30న అయోధ్య ధామ్ జంక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. స్టేషన్ పేరు మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనను తాజాగా భారతీయ రైల్వే అంగీకరించింది. అయితే, స్టేషన్ కోడ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించింది. 22న జరగనున్న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6వేలమందికిపైగా అతిథులు హాజరుకానున్నారు. ఈ నెల 30న ప్రధాని మోదీ అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. అదే రోజు అయోధ్య రైల్వే స్టేషన్‌లో కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ భవనంలో ఎయిర్‌పోర్ట్‌ను తలపించే విధంగా సౌకర్యాలు ఉండనున్నాయి. సంప్రదాయ ఆలయ ఆర్కిటెక్చర్ స్ఫూర్తితో ఈ భవనాన్ని నిర్మించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.