ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??

|

Jun 26, 2024 | 3:15 PM

ప్రభుత్వ ఉద్యోగులంటే సమయానికి ఆఫీసుకు రారని, ఇష్టం వచ్చినప్పుడు తాపీగా వస్తారని చాలామంది అభిప్రాయపడుతుంటారు. చాలాచోట్ల అలాగే జరుగుతుంటుంది కూడా. అయితే, ఇకపై ఇష్టమొచ్చినపుడు ఆఫీసుకు వస్తానంటే కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 9:15 గంటల లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈమేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

ప్రభుత్వ ఉద్యోగులంటే సమయానికి ఆఫీసుకు రారని, ఇష్టం వచ్చినప్పుడు తాపీగా వస్తారని చాలామంది అభిప్రాయపడుతుంటారు. చాలాచోట్ల అలాగే జరుగుతుంటుంది కూడా. అయితే, ఇకపై ఇష్టమొచ్చినపుడు ఆఫీసుకు వస్తానంటే కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 9:15 గంటల లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈమేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కరోనా టైమ్ లో వైరస్ భయంతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్తి పలికిన ఉద్యోగులు.. చాలాచోట్ల ఇప్పటికీ దానిని ఉపయోగించడంలేదని సమాచారం. హాజరు కోసం గతంలోలాగే రిజిస్టర్ నిర్వహిస్తున్నారని, దీంతో ఎంత లేట్ గా వచ్చినా ఇన్ టైంలోనే వచ్చినట్లు అందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ.. ఏదైనా కారణం వల్ల ఆలస్యం జరిగే అవకాశం ఉందనుకుంటే ముందుగానే తన పై అధికారికి సమాచారం ఇచ్చి, ఆ పూటకు క్యాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటల తర్వాతే ఔట్ పంచ్ పడాలని స్పష్టం చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral VIdeo: లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి

కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు

రామాపురం కాదది యమపురం… ఆ బీచ్‌కు వెళ్ళారా… అంతే సంగతులు

వావ్‌! 27 ఏళ్ల తర్వాత.. ఆ అమ్మాయి.. ఈ అబ్బాయి!

Jr NTR: ‘నా గుండె కోస్తే మా బాబాయ్‌ బాలకృష్ణ కనిపిస్తారు’

Follow us on