పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్‌.. ఏం జరిగిందంటే..

|

Jul 13, 2024 | 2:19 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కూనవరం మండలంలోని బండారు గూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు.. విద్యార్థులకు యధావిధిగా పాఠం బోధిస్తుండగా హఠాత్తుగా పాఠశాల భవనం పైకప్పు నుంచి పెద్ద శబ్దంతో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి నేలపడింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కూనవరం మండలంలోని బండారు గూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు.. విద్యార్థులకు యధావిధిగా పాఠం బోధిస్తుండగా హఠాత్తుగా పాఠశాల భవనం పైకప్పు నుంచి పెద్ద శబ్దంతో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి నేలపడింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పాఠశాల తరగతి గదిలో విద్యార్థులను కూర్చో పెట్టేందుకు భయపడుతున్నారు టీచర్లు. గత్యంతరం లేక స్కూల్ కు వచ్చిన పిల్లలకు ఆరుబయట స్కూల్ కాంపౌండ్లో చాపవేసి కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు టీచర్లు. ఓపెన్ టాప్ స్కూల్ తరహాలో బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసి మట్టి నేలపై పాఠాలు చెప్పారు. ఈ ఘటనపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని నూతన పాఠశాల భవననిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే భవనం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. పాఠశాల భవనం నుండి వర్షపు నీరు కూడా కారుతుందని టీచర్లు తెలిపారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణం చిన్నారులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పశువుల పాక నుంచి వింత శబ్దాలు..ఏంటా అని చూసిన రైతు షాక్‌!

బదిలీపై వెళ్తున్న గురువుకు అరుదైన గురు దక్షిణ !!

భార్యతో గొడవలు.. ఈ మధ్యలో నయా బ్యూటీ ఎంట్రీ…

Digital TOP 9 NEWS: వావ్‌..! 1000 కోట్ల కల్కి.. | బెస్ట్ యాక్టర్స్‌గా చరణ్‌, తారక్‌కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌

Follow us on